బాలయ్య కోసం వెయిటింగ్ తప్పదు

Update: 2019-04-18 07:32 GMT
ఎన్టీఆర్ ఇచ్చిన ఝలక్ నుంచి కోలుకోవడానికి బాలయ్యకు ఎంత టైం పట్టిందో కాని ఊహించని దారుణ పరాజయం జీర్ణం చేసుకోవడం అభిమానులకు మాత్రం అంత ఈజీగా జరగలేదు.నాన్నకు ఘన నివాళిగా ఇద్దామని చేసిన ప్రయత్నం తేడా కొట్టేయడంతో కొంతకాలం బాలకృష్ణ బయట ఎక్కడా కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలోనూ కొంత ఆలస్యంగానే ప్రవేశించారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి.

బోయపాటి శీను తన వంతు బాద్యతగా టిడిపి యాడ్స్ ని రక్తి కట్టించి ప్రచారంలో తనదైన ముద్ర వేశాడు. అతిశయోక్తి బాగా ఎక్కువైనట్టు అనిపించినా మొత్తానికి తన స్టైల్ మారదని మాత్రం మరోసారి రుజువు చేశాడు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో మొదలుపెట్టాల్సిన మూవీ ఇంకొంత ఆలస్యం అయ్యేలా ఉందని ఫిలిం నగర్ టాక్

ఎపి ఎన్నికల ఫలితాలు మే 23 వస్తాయి కాబట్టి అప్పటిదాకా వేచి చూసి తాను పోటీ చేస్తున్న హిందూపురం నుంచి కనక మళ్ళి గెలిస్తే ఎమెల్యేగా ప్రమాణస్వీకారం చేసి సినిమాలు మొదలుపెడదామనే ఆలోచనలో బాలయ్య ఉన్నట్టు తెలిసింది. మరోవైపు ఖచ్చితంగా హిట్టు కొట్టాల్సిన టార్గెట్ తో బోయపాటి శీను స్క్రిప్ట్ ను పదే పదే చేక్కుతున్నట్టుగా మరో టాక్ ఉంది,.

వినయ విధేయ రామ ఫలితం అతని ఇమేజ్ మీద తీవ్ర ప్రభావం చూపించింది. అందరూ తన వైపే వేలెత్తి చూపడంతో శీనుకి మళ్ళి రుజువు చేసుకోవాల్సిన అవసరం వచ్చి పడింది. సో బాలయ్య ఎలక్షన్ రిజల్ట్స్ చూసి తన వియ్యంకుడు అధికారంలోకి వస్తాడా రాడా చెక్ చేసుకుని ఆ తర్వాత బోయపాటి సెట్ లో అడుగు పెట్టవచ్చట. మొత్తానికి నందమూరి ఫ్యాన్స్ తో పాటు బోయపాటి వెయిటింగ్ కూడా కొనసాగనుంది
    

Tags:    

Similar News