తెలుగులో హీరోలతో సమానంగా స్టార్ ఇమేజ్ సంపాదించిన దర్శకులు కొందరున్నారు. అందులో బోయపాటి శ్రీను ఒకడు. మాస్ ప్రేక్షకులకు బోయపాటి అంటే విపరీతమైన అభిమానం. తెలుగులో ప్రస్తుతం ఊర మాస్ హీరోయిజాన్ని పండించాలంటే ఎవరైనా బోయపాటి తర్వాతే. ప్రధానంగా క్లాస్ ప్రేక్షకుల్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ ను ‘సరైనోడు’లో ఊర మాస్ గా ప్రొజెక్ట్ చేసి ఆ వర్గం ప్రేక్షకుల్లో అతడికి ఫాలోయింగ్ పెంచిన ఘనత బోయపాటిదే. ఈ సినిమాతో బోయపాటి ఇమేజ్ మరింత పెరిగింది. దీని తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి అప్ కమింగ్ హీరోతో జట్టు కట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు బోయపాటి. అయినప్పటికీ ఈ సినిమాకు క్రేజీ బిజినెస్ ఆఫర్లు వస్తుండటం విశేషం.
ఒక స్టార్ హీరో సినిమా తరహాలోనే బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు బిజినెస్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సీడెడ్ ఏరియాలో ఈ సినిమా హక్కుల కోసం ఓ డిస్ట్రిబ్యూటర్ ఏకంగా రూ.7.2 కోట్ల ధర ఆఫర్ చేశాడట. సీడెడ్లో మామూలుగా స్టార్ల సినిమాలకు 8-9 కోట్ల మధ్య రేటు పలుకుతుంటుంది. ఆ లెక్కన చూస్తే బెల్లంకొండ సినిమాకు భారీ రేటు వచ్చినట్లే. ఇదంతా బోయపాటి ఘనతే అనడంలో సందేహం లేదు. సీడెడ్ మాత్రమే కాదు.. మిగతా ఏరియాల్లోనూ ఈ సినిమాకు మంచి రేట్లే పలుకుతున్నాయట. బిజినెస్ రూ.40 కోట్లకు తక్కువయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. ఒక్క ఓవర్సీస్ లో మినహాయిస్తే అన్ని ఏరియాల్లోనూ రేట్లు భారీగానే ఉంటాయంటున్నారు. ఈ చిత్రం జులై 9న విడుదలయ్యే అవకాశాలున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/