బోయపాటి శ్రీను- దేవిశ్రీ ప్రసాద్ ఈ కాంబినేషన్ కి చాలానే సక్సెస్ రేట్ ఉంది. ఒకటి కాదు రెండు కాదు.. వీళ్లిద్దరూ కలిసి గతంలోనే హ్యాట్రిక్ కొట్టేశారు. భద్ర - తులసి - లెజెండ్ సినిమాలతో.. మంచి సక్సెస్ లను సాధించారు. అయితే.. ఈ హవా ఒకే ఒక ఇన్సిడెంట్ తో బ్రేక్ పడింది. అసలు వీళ్లిద్దరి కాంబినేషన్ సెట్ కాదేమో అనుకునే పరిస్థితి ఏర్పడింది.
లెజెండ్ మూవీ ఆడియో రిలీజ్ టైంలో.. స్టేజ్ పైనే నానా రచ్చ జరిగింది. 'దేవిశ్రీ బిజీగా ఉన్నా.. ఆయనతో పాటే మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చుని.. కావలిసినట్లుగా పిండుకున్నాం' అంటూ బోయపాటి చేసిన కామెంట్స్ తో.. డీఎస్పీకి మండిపోయింది. తను మాట్లాడ్డం అయిపోయినా.. మరోసారి మైక్ తీసుకుని 'మ్యూజిక్ డైరెక్టర్లకు ఎవరూ చెప్పనక్కర్లేదు.. మేమేం చేయాలో మాకు తెలుసు.. అయినా మేమేమన్నా ఆవులమా.. పాలు పిండినట్లు మ్యూజిక్ పిండుకోవడానికి' అని నిలదీశాడు దేవిశ్రీ ప్రసాద్. అప్పుడు స్టేజ్ పై ఏర్పడిన వివాదం ఎఫెక్ట్ చాలా కాలమే కంటిన్యూ అయింది.
బన్నీకి ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ అయినా.. బోయపాటి కోసం సరైనోడుకు థమన్ ను తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ఆవు కథ వివాదాన్ని బోయపాటి- దేవిశ్రీలు పక్కన పెట్టినట్లుగా కనిపిస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి తెరకెక్కించనున్న చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనుండడం హాట్ టాపిక్ గా మారింది. పాత వివాదాలను పక్కన పెట్టి ఇద్దరు ట్యాలెంటెడ్ టెక్నీషియన్స్ ఒక తాటి పైకి రావడాన్ని మాత్రం అభినందించాల్సిందే.