​ఈ సినిమాకు 40 కోట్లు వస్తాయట

Update: 2017-07-28 05:12 GMT
సినిమా ఆడియో ఫంక్షన్లలో హీరోలు ప్రొడ్యూసర్లు కాస్త ఎక్కువ మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. పోనిలే ఏదో ప్రచారం కోసం ఫంక్షన్ పెట్టారు కదా ఆ మాత్రం చెబుతారులే అని అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఒక సినిమా కోసం హీరో ప్రొడ్యూసర్ ప్రచారం కన్న ఆ సినిమా డైరెక్టర్ మాటలే కొంచెం  అతిగా ఉన్నాయి. కథ పై నమ్మకం ఉండటంలో తప్పులేదు కానీ ఇలా అన్నీ కోట్లు కలెక్ట్ చేస్తుంది వాళ్ళతో పోటీ పడుతుంది అని మాట్లాడేస్తున్నాడు చూడండి.. అదే కాస్త కలవరపెడుతోంది.

సరైనోడు సినిమా విజయంతో  తెలుగు స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో పెద్ద పొజీషన్లో బోయపాటి శ్రీను చేరిపోయాడు. ఇప్పుడు ఈయన డైరెక్ట్ చేసిన సినిమా జయ జానకి నాయక సినిమా ఆగష్టు 11 నాడు విడుదల కాబోతుంది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కూడా ఏదో కమర్షియల్ తెలుగు సినిమాలా ఉంది పైగా స్టార్ హీరో కూడ లేడు సినిమాలో. కాని బోయపాటి మాత్రం “నాకు ఈ సినిమా విజయం సాధిస్తుంది అనే నమ్మకం ఉంది. కచ్చితంగా ఈ సినిమా 30 కోట్లు బిజినెస్ చేస్తుంది. నా అంచనాలు కనుక ఫలిస్తే 40 కోట్లు కూడా రావచ్చు అని చెబుతూ ఈ సినిమాకు ఏ సినిమా పోటీ కాదు ఎందుకంటే ఈ సినిమా ప్రేక్షకులు ఎవరో నాకు తెలుసు వాళ్ళు కచ్చితంగా వచ్చి నా సినిమాను విజయవంతం చేస్తారు'' అని చెబుతున్నాడు. బోయపాటి నమ్మి కొంతమంది బయ్యర్లు కూడా  ఎక్కువ రేటుకు కొనడానికి సిద్దపడిపోతున్నారు.

అయితే ఇదే రోజున అంటే ఆగష్టు 11 న మరో యంగ్ హీరోలు సినిమాలు పైగా ప్రేక్షకులలో మంచి ఆసక్తి ఉన్న సినిమాలు విడుదల కాబోతున్నాయి. నితిన్ హీరోగా వస్తున్న ‘లై’ ఆరోజే రాబోతుంది. ఈ పోటీలో నిలబడి ఒకవేళ బోయపాటి ప్రెడక్షన్ ను నిజం చేస్తే మాత్రం.. జయ జానకి నాయక సినిమాకు తిరగే ఉండదు. చూద్దాం ఆడియన్స్ ఏం చేస్తారో!!
Tags:    

Similar News