నాన్నగారు పది రెట్లు పవర్ ఫుల్ గా చెప్పారట!

Update: 2019-01-10 14:27 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా 'వినయ విధేయ రామ' రేపే(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇప్పటికే ఈ సినిమా ప్రోమోస్ అన్నీ ఎలా ఉంటుంది ఇండికేషన్స్ ఇచ్చాయి.  చరణ్ పూర్తిగా బోయపాటి హీరోగా మారి ఊరమాస్ అవతారమెత్తాడని ఆడియన్స్ అర్థం చేసుకున్నారు. ఇక ఈ సినిమా టీజర్ లోని 'రామ్ కొ..ణి..దె..ల' డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. సరిగ్గా ఈ డైలాగ్ గురించి చరణ్ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నాడు.

ఈ సినిమాలో చాలా సీన్లలో తన పేరును చెప్తాడట చరణ్. కొన్ని డైలాగులకు ముందు కొన్ని డైలాగులకు వెనక రామ్ కొణిదెల పేరును చెప్పానని.. ఆ డైలాగులు చెప్పే సమయంలో  తనకేమీ ఇబ్బందిగా అనిపించలేదన్నాడు.  కాకపొతే నాన్నగారు మాత్రం బోయపాటిని ఈ విషయంలో ప్రశ్నించారని చెప్పాడు.  "బోయపాటి..  అసలు ఎవరి పర్మిషన్ తీసుకుని ఆ పేరు వాడావు?" అంటూ సరదాగా అడిగారట. 

ఏదేమైనా మెగాస్టార్ కూడా ఈ డైలాగ్ పట్ల ముచ్చట పడ్డాడు.  లేకపోతే 'కొ..ణి..దె..ల' డైలాగ్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చరణ్ స్టైల్ లో చెప్పి ఉండేవారు కాదు కదా? చిరు ఆ డైలాగ్ చెప్పడంతో ఫ్యాన్స్ థ్రిల్ అయ్యారు.  చిరంజీవి తన డైలాగ్ చెప్పడం గురించి చరణ్ మాట్లాడుతూ "ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాన్నగారు నాకంటే పదిరెట్లు పవర్ఫుల్ గా ఆ డైలాగ్ చెప్పారు" అంటూ మురిసిపోయాడు.  
   

Tags:    

Similar News