బోయపాటి నో చెప్పెసాడా?

Update: 2019-02-18 05:30 GMT
వినయ విధేయ రామ డిజాస్టర్ ప్రభావం టీం మీద మాములుగా పడలేదు. స్టార్ హీరోలకు ఇలాంటి దెబ్బలు సర్వసాధారణం కాని రంగస్థలం తర్వాత ఇలాంటి సినిమా చేయడమే వ్యవహారాన్ని మరింత ముదిరిపోయేలా చేసింది. ఏకంగా హీరో రామ్ చరణ్ తో పబ్లిక్ గా ప్రేక్షకులకు సారీ లెటర్ రాయించింది. అభిమానులు విపరీతంగా హర్ట్ అయ్యే రేంజ్ లో ఈ సినిమాలోని సీన్ల మీద ట్రాలింగ్ నడిచింది. బయ్యర్లను సుమారు 30 కోట్ల దాకా ముంచేసింది. కథ ఇక్కడితో అయిపోలేదు.
 
నష్టపరిహారం విషయం దానయ్యకు బోయపాటి శీనుకు మధ్య మాటల యుద్ధం జరిగిందని దిల్ రాజు లాంటి మధ్యవర్తులు వచ్చి చల్లబరిచారని కొద్దిరోజుల క్రితం గట్టి ప్రచారమే జరిగింది. చరణ్ దానయ్య చెరో ఐదు కోట్లు ఇవ్వగా శీను ఫైనల్ గా కోటి దాకా ఇస్తానని ఒప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఫ్రెష్ అప్ డేట్ ప్రకారం ఆ కోటి కూడా తూచ్ ఇవ్వను అని బోయపాటి చెప్పినట్టు ఫిలిం నగర్ టాక్ సినిమా నిర్మించడం దానికి విడుదల వ్యవహారాలు బిజినెస్ అన్ని నిర్మాత బాద్యతని ఒప్పుకున్న కథను చెప్పిన బడ్జెట్ లో తీసిచ్చినందుకు గాను తనకు రెమ్యునరేషన్ ఇచ్చారు కాబట్టి కోటి రూపాయలైనా ఎందుకు ఇవ్వాలని రివర్స్ అయినట్టు చెబుతున్నారు.

ఇది నిజమో కాదో కాని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. దానికి తోడు వినయ విధేయ రామ విడుదల ముందు బోయపాటి శీనుకు అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలు ఇప్పుడు డ్రాప్ అయ్యే ఆలోచనలో ఉన్నారట. అదే మాట శీనుని అడిగితే అదేమీ లేదని బాలయ్యతో హిట్టు కొట్టాక అన్ని సర్దుకుంటాయని ఇప్పుడు వద్దన్న వాళ్ళే క్యు కడతారని చెబుతున్నాడట. అంతా బాగానే ఉంది కాని వివిఅర్ తో కోల్పోయిన నమ్మకాన్ని బాలయ్య సినిమాతో తిరిగి రాబట్టుకోవాలి అంటే బోయపాటి ఓ రేంజ్ లో కష్టపడక తప్పదు


Tags:    

Similar News