బాయ్ కాట్ బాలీవుడ్.. ఎందుకింత నెగెటివిటీ?

Update: 2022-08-15 09:30 GMT
అస‌లు ఈ బాలీవుడ్ కి ఏమైంది?  #బాయ్ కాట్ బాలీవుడ్ స్టార్! నినాదం అంకంత‌కు ఉరుముతోంది. ఫ‌లానా హీరో సినిమాని బ‌హిష్క‌రించాలి! అంటూ నేరుగా సోష‌ల్ మీడియాల్లో ప్ర‌చారం సాగుతోంది. అమీర్ ఖాన్ .. అక్ష‌య్ కుమార్ .. స‌ల్మాన్ ఖాన్ ..

ఇలా హీరోలంద‌రికీ ఈ ముప్పు త‌ప్ప‌డం లేదు. మ‌రోవైపు #బాయ్ కాట్ బాలీవుడ్ మాఫియా! నినాదం కూడా అంతే సంచ‌ల‌నంగా మారుతోంది. క్వీన్ కంగ‌న ర‌నౌత్ లాంటి సీనియ‌ర్ నాయిక‌లు బాలీవుడ్ మాఫియాపై నిరంత‌రం చెల‌రేగుతున్న తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ఇక నెటిజనులు కూడా బాలీవుడ్ పై బోలెడంత నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తుంటే స్టార్లంతా బెంబేలెత్తిపోతున్నారు. ఉత్త‌రాది ప్ర‌జ‌లు ఉత్త‌రాది హీరోల‌ను ఆద‌రించ‌డం లేద‌న్న‌ది ఇప్పుడు గుండె పోటులా మారింది. త‌మ సినిమాల రిలీజ్ ముంగిట ఉండ‌గా  హీరోలు నిర్మాత‌ల‌కు ల‌బ్ డ‌బ్ అంత‌కంత‌కు పెరిగిపోతోంది. ఇటీవ‌ల లాల్ సింగ్ చ‌డ్డా రిలీజ్ ముంగిట అమీర్ ఖాన్ ఇలాంటి స‌న్నివేశాన్ని ఎదుర్కొన్నాడు. ఇక ఎన్న‌డూ లేనంత‌గా అమీర్ ఖాన్ పై బోలెడంత నెగెటివిటీ స్ప్రెడ్ అయ్యింది.

బాయ్ కాల్ లాల్ సింగ్ చ‌డ్డా అంటూ విప‌రీత‌మైన ప్ర‌చారం సాగింది. దీనిప‌ర్య‌వ‌సానం ఏకంగా ఈ మూవీకి ఓపెనింగులు దారుణంగా ప‌డిపోయాయి. ప్ర‌తిసారీ ఓపెనింగ్ డే 25 కోట్లు తెచ్చే అమీర్ ఖాన్ ఈసారి 12 కోట్ల‌కు ప‌డిపోయాడు. ఇది అత‌డి కెరీర్ లోనే దారుణ‌మైన చెత్త రికార్డ్. అంతేకాదు ఖిలాడీ అక్ష‌య్ కుమార్ న‌టించిన ర‌క్షాబంధ‌న్ ని కూడా బ‌హిష్క‌రించాల‌న్న ప్ర‌చారం సాగింది. ఉత్త‌రాది లో థియేట‌ర్ వ‌ద్ద ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం తెలిసిందే. ఇక అక్ష‌య్ కెన‌డా పౌర‌స‌త్వాన్ని క‌లిగి ఉండ‌డంతో అత‌డిని దేశం విడిచి వెళ్లాల‌ని కూడా నెటిజ‌నులు విమ‌ర్శించారు.

కార‌ణం ఏదైనా అస‌లే వ‌రుస ప‌రాజ‌యాల‌తో బెంబేలెత్తుతున్న బాలీవుడ్ కి ఇదంతా అయోమ‌యంగా మారింది. ఈ గంద‌ర‌గోళంలోనే ఉత్త‌రాది స్టార్ హీరోలు అంతో ఇంతో దిగొచ్చారు. మునుప‌టిలా ఈగోల‌కు పోవ‌డం లేదు. సౌత్ ని చిన్న చూపు చూడ‌టం కూడా ఆల్మోస్ట్ జీరో అయిపోయింది. మొన్న‌టికి మొన్న సౌత్ సినిమా దారిలోనే వెళ‌తామ‌ని ఖిలాడీ అక్ష‌య్ కుమార్ అన్నారంటే అర్థం చేసుకోవాలి. ఇటీవ‌లి కాలంలో  ప‌రిస్థితిని చక్క‌దిద్దేందుకు ఆడియెన్ ప‌ల్స్ ప‌ట్టుకున్న టాలీవుడ్ ని ప‌రిశీలించేందుకు బాలీవుడ్ ఎంతో ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తోంది.

అక్క‌డ దిగ్గ‌జాలంతా ఇప్పుడు సౌత్ సినిమా సక్సెస్ సీక్రెట్ పై ఆరాలు తీస్తున్నారు. ఇక్క‌డి సినిమాల్ని అక్క‌డ విప‌రీతంగా రీమేక్ లు చేయాల‌నుకుంటున్నారు. ఇదంతా మునుపెన్న‌డూ చూడ‌ని స‌న్నివేశం. అయితే బాలీవుడ్ దారికి రావాలంటే కొన్నాళ్ల పాటు టాలీవుడ్ నిర్మాత‌ల గిల్డ్ త‌ర‌హాలోనే ఏదైనా బంద్ పాటించాల్సి ఉంటుంది. ఆ సమ‌యంలో ప‌రిశ్ర‌మ స్థితిపై విస్త్ర‌తంగా చ‌ర్చించి ఒకే గొడుకు కింద‌ ఫిలింమేక‌ర్స్ కొత్త ఆలోచ‌న‌లు చేయాల్సి ఉంటుంది. మ‌రి ఆ దిశ‌గా దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌డ‌తారా లేదా అన్న‌ది వేచి చూడాలి.
Tags:    

Similar News