#BoycottBrahmastra.. సోషల్‌ మీడియా దాటి బయటకు వచ్చేసింది

Update: 2022-09-07 10:30 GMT
బాలీవుడ్‌ ను గత కొన్నాళ్లుగా భయపెడుతున్న బాయ్ కాట్ సోషల్‌ మీడియా బ్యాచ్ ఇప్పుడు ఏకంగా రోడ్ల మీదకు రావడం సినిమా ఇండస్ట్రీ వర్గాల వారికి మరింతగా ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా #BoycottBrahmastra హ్యాష్‌ ట్యాగ్‌ తో బాయ్‌ కాట్‌ బ్రహ్మాస్త్ర అంటూ సోషల్‌ మీడియా లో రచ్చ చేస్తున్న కొందరు ఇప్పుడు ఏకంగా రోడ్డు మీద నిరసన కు కూడా దిగడం చర్చనీయాంశంగా మారింది.

బ్రహ్మాస్త్ర సినిమా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రమోషన్‌ లో భాగంగా మహాకాళేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించేందుకు గాను ఉజ్జయిని వెళ్లారు. అక్కడకు రణబీర్‌ కపూర్‌.. ఆలియా మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు వస్తున్న సంగతి తెలిసిన బాయ్ కాట్‌ బ్యాచ్ పెద్ద ఎత్తున వారికి వ్యతిరేకంగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం వద్దకు రణబీర్ కపూర్ మరియు ఆలియా వచ్చిన వెంటనే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

బాయ్ కాట్‌ బ్రహ్మాస్త్ర అంటూ రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్‌ లకి వ్యతిరేకంగా ఆందోళన చేశాడు. దాంతో వారిద్దరూ ఆలయంలో జరిగిన పూజలో పాల్గొనకుండానే అక్కడి నుండి వెనుదిరగవలసి వచ్చింది. కేవలం దర్శకుడు అయాన్‌ ముఖర్జీ మాత్రమే పూజలో పాల్గొని అక్కడ నుండి వెళ్లి పోయినట్లుగా స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.

ఇన్నాళ్లు సోషల్‌ మీడియా వరకే పరిమితం అయిన బాయ్‌ కాట్‌ బ్యాచ్‌ ఇప్పుడు ఇలా రోడ్ల మీద నిరసన కు కూడా దిగడంతో ఇండస్ట్రీ వర్గాల వారు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆందోళన మరింత ఎక్కువ అయితే బ్రహ్మాస్త్ర సినిమా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు అంటూ రణబీర్ కపూర్ సన్నిహితులతో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు ఆందోళనతో ఉన్నారు. ఉత్తర భారతంలో ఈ బాయ్ కాట్‌ బ్యాచ్‌ ఎక్కువగా ఉంది. కనీసం సౌత్‌ లో అయినా బ్రహ్మాస్త్ర ఆడుతుందేమో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News