శ్రీను వైట్ల-కోన వెంకట్ - గోపీ మోహన్ కాంబినేషన్ అంటేనే ఆ సినిమాలో కామెడీ హైలైట్ గా ఉంటుంది. సినిమాలో ఎన్ని హైలైట్లు ఉన్నా.. చివరికి అందరూ మాట్లాడుకునేది కామెడీ గురించే. ‘బ్రూస్ లీ’ సినిమాలో కూడా హైలైట్లకు కొదవలేదు. అలాగే కామెడీ విషయంలోనూ వైట్ల-కోన మార్కు కచ్చితంగా ఉంటుందని అంటున్నారు యూనిట్ సభ్యులు.
‘దూకుడు’ సినిమాలో బ్రహ్మానందం - ఎమ్మెస్ నారాయణల కామెడీ ఏ రేంజిలో పేలిందో.. ‘బ్రూస్ లీ’లో బ్రహ్మానందం - జయప్రకాష్ రెడ్డి అదే స్థాయిలో నవ్వించబోతున్నట్లు చెబుతున్నారు. ఇందులో బ్రహ్మి ఆఫ్ఘనిస్థాన్ టెర్రరిస్టుల్ని పట్టుకోవడానికి అక్కడికెళ్లి బార్బర్ షాపు పెట్టే అండర్ కవర్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు. పేరు.. సుజుకి సుబ్రమణ్యం అలియాస్ పీటర్ అలియాస్ పకోడి. ఈ ఆఫ్ఘనిస్థాన్ ఎపిసోడ్ కడుపుబ్బ నవ్విస్తుందట.
మరోవైపు సినిమా డైరెక్టర్ గా జయప్రకాష్ రెడ్డి పాత్ర కూడా అదే రేంజిలో పేలుతుందట. ‘దుబాయ్ శీను’లో హీరోల మీద సెటైర్లు వేసిన వైట్ల.. ఈసారి తన డైరెక్టర్ల వర్గం మీదే పడుతున్నాడు. చరణ్ ఆ డైరెక్టరు దగ్గరే స్టంట్ మాస్టర్ గా చేస్తుంటాడు. ఈ పాత్ర ద్వారా డైరెక్టర్ల పైత్యం ఎలా ఉంటుందో సెటైర్లు వేస్తూ కామెడీ పండిస్తారట. బ్రహ్మి - జేపీ కాంబినేషన్ లోనూ కొన్ని సీన్లుంటాయంటున్నారు. మొత్తానికి ‘బ్రూస్ లీ’కి బ్రహ్మి-జేపీ కామెడీ హైలైట్ గా నిలవడమైతే ఖాయమట.