ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో బోలెడన్ని ఛేంజెస్ వస్తున్నాయి. రొటీనిటీని బద్ధలు కొట్టే టైమ్ స్టార్టయ్యింది. అందుకేనేమో.. కొన్ని ఫ్రెండ్షిప్స్ దారుణంగా ముక్కలయ్యాయి. ఒకరిని వీడి ఇంకొకరు ఉండలేని పరిస్థితి నుంచి అంతా బైటపడుతున్నారు. కోన - శ్రీను వైట్ల విడిపోయారు. అలాగే బ్రహ్మానందం తో కూడా కోన తెగతెంపులు చేసుకున్నాడా? అని అనిపిస్తోంది మరి. ఇటీవలే రిలీజైన కోన శంకరాభరణంలో బ్రహ్మీ మిస్సవ్వడం ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చకొచ్చింది.
ఈ సినిమాలో బోలెడంత మంది కమెడియన్స్ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అంతా కమెడియన్లే. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అప్ కమ్ కమెడియన్లున్నారు. జబర్ధస్త్ గ్యాంగ్ ఉన్నారు. అసలు వీళ్లెవరో అనుకునే నటులు కూడా కనిపించారు మరి. వైవా హర్ష - సప్తగిరి.. లాంటి కమెడియన్లు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. వాళ్లని ఎంకరేజ్ చేస్తూ కోన చక్కని సీన్లే రాసుకున్నాడు. అలాగే బాలీవుడ్ నుంచి సంజయ్ మిశ్రాని కూడా రంగంలోకి దించారు కోన. మరి ఇంతమందిని తెచ్చిన కోన తనకి ఎంతో ప్రీతిపాత్రుడైన బ్రహ్మానందాన్ని ఎందుకు వదిలేసినట్టు?
రాజుగారే తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా అన్నట్టు కోననే తలుచుకుంటే బ్రహ్మీ కోసం క్యారెక్టర్ పుట్టదూ? బ‌్రహ్మీ కోసం చారి - మెక్ డొనాల్డ్ మూర్తి లాంటి క్యారెక్టర్లను క్రియేట్ చేసిన కోన ఈసారి ఎందుకు అతడి కోసం ఏ క్యారెక్టర్ క్రియేట్ చే్యలేదు. ఏదైనా డిఫరెన్సెస్ వచ్చాయా అంటూ ప్రశ్నిస్తున్నారు ఫిలింనగర్ జనాలు. మరి కోన ఏం చెబుతాడో?