కిల్‌ బిల్‌ పాండే ఇప్పుడు పండిట్‌ రవితేజ

Update: 2015-08-19 20:24 GMT
బ్రహ్మానందంపై ఇటీవలి కాలంలో ఫిలింసర్కిల్స్‌ లో నెగెటివ్‌ ప్రాచారం సాగుతోంది. అతడిని కావాలనే పరిశ్రమ దూరం పెడుతోంది. దర్శకనిర్మాతలు తమ సినిమాలకు ఎంపిక చేసుకోవడం లేదంటూ పుకార్లు క్రియేట్‌ చేస్తున్నారు. 1000 సినిమాలకు చేరువలో ఉన్న ఆయనకు ఇదో అపశృతి. అయినా అతడు ఏమాత్రం చలించక కిక్‌ 2 చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

రేసుగుర్రంలో కిల్‌ బిల్‌ పాండే గా వచ్చి నవ్వించాడు. ఇప్పుడు పండిట్‌ రవితేజగా కడుపుబ్బా నవ్వించడానికి వస్తున్నాడు. ఇంకాస్త డీటెయిల్స్‌ లోకెళితే.. కిల్‌బిల్‌ పాండే (పోలీస్‌) .. ఫ్రస్ట్రేషన్‌ లో ఎవరిని పడితే వాళ్లని చంపుతాడు. చేతిలో గన్‌ పేలిందో లేదో కూడా అతడికి తెలీదు. దడ్‌ దడ్‌ ధడేల్‌ అంటూ అది పేలుతూనే ఉంటుంది. తనకి తెలియకుండానే బోలెడుమందిని ఎన్‌ కౌంటర్‌ చేసేస్తాడు. ఈ ఫీట్లన్నీ అదరగొట్టేశాడు రేసుగుర్రంలో. బ్రహ్మీ కనిపించిన 20నిమిషాల ఎపిసోడ్‌ కడుపు చెక్కలయ్యేలా నవ్వించింది.

అప్పుడు అతడిని డైరెక్ట్‌ చేసింది సురేందర్‌ రెడ్డి. ఇప్పుడు కూడా సురేందర్‌ రెడ్డి మరో కొత్త కోణంలో బ్రహ్మీని చూపిస్తున్నాడు. పండిట్‌ రవితేజ అంటూ ఏకంగా కిక్‌2 హీరో రవితేజ పేరు అతడికి పెట్టేశాడు. అందుకు తగ్గట్టే పండిట్‌ కామెడీ అదిరిపోతుందని రవితేజనే చెబుతున్నాడు. ఇంకో రెండు రోజుల్లో కిక్‌2 రిలీజవుతోంది కాబట్టి కాస్త ఓపిగ్గా వేచి చూద్దాం.
Tags:    

Similar News