2015.. బ్రహ్మానందం కెరీర్ లో మరపు రాని సంవత్సరం. దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగు పరిశ్రమలో స్టార్ కమెడియన్ గా ఆధిపత్యం చలాయిస్తూ వచ్చిన బ్రహ్మి.. గత ఏడాది చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు. గత ఏడాది బ్రహ్మి చేసిన సినిమాలు వేటిలోనూ ఆయన క్యారెక్టర్లు పేలలేదు. బ్రహ్మి పనైపోయిందన్న ప్రచారం చాలా గట్టిగా సాగింది. బ్రహ్మి డౌన్ అవుతున్న టైంలోనే పృథ్వీ - సప్తగిరి లాంటి కమెడియన్లు రైజ్ అవడంతో ఇక మన సీనియర్ కమెడియన్ భవిష్యత్తు ఏంటో అని అంతా కంగారు పడిపోయారు. ఇలాంటి టైంలో కొత్త ఏడాదిలో బ్రహ్మి కెరీర్ ఎలా సాగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూశారు.
ఐతే కొత్త ఏడాదిలో బ్రహ్మికి ఓ మోస్తరు ఆరంభమే లభించింది. సంక్రాంతికి వచ్చిన నాలుగు సినిమాల్లో బ్రహ్మి నటించిన మూవీ కూడా ఒకటుంది. అదే సోగ్గాడే చిన్నినాయనా. ఇందులో బ్రహ్మి ఆత్మలతో మాట్లాడే స్వామీజీ పాత్రలో నటించాడు. ఈ క్యారెక్టర్ గొప్పగా పేలిందని చెప్పలేం కానీ.. ఓ మోస్తరుగా అయితే నవ్వించింది. బ్రహ్మి తనదైన శైలిలో ఎక్స్ ప్రెషన్స్ తో అలరించాడు. నాగార్జున కాంబినేషన్లో వచ్చే సన్నివేశంలో కామెడీ బాగా పండించాడు. ఓ సన్నివేశంలో బంగారు కోడిపెట్ట, లుంగీ డ్యాన్స్ పాటలకు తనదైన శైలిలో స్టెప్పులు కూడా వేసి అలరించాడు బ్రహ్మి. మొత్తానికి ఈ ఏడాది బ్రహ్మి శుభారంభమే చేశాడు. ‘డిక్టేటర్’లో పృథ్వీ క్యారెక్టర్ పెద్దగా పేలని నేపథ్యంలో సంక్రాంతి రేసులో బ్రహ్మి పైచేయి సాధించినట్లే. కాబట్టి బ్రహ్మి కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు.