అక్కినేనికి బ్రహ్మాస్త్ర.. చాలా ముఖ్యమే నాగ్!

Update: 2022-09-08 02:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసే వారసులలో అక్కినేని నాగార్జున ఒకరు. ఆయనకు మన్మథుడు కింగ్ అంటూ సినిమా ఇండస్ట్రీలో వివిధ రకాల ట్రెండింగ్ ట్యాగ్స్ ఉన్నప్పటికీ ఆయనతోపాటు వచ్చిన హీరోల తరహాలో మాత్రం బాక్సాఫీస్ రేంజ్ ను పెంచుకోలేకపోయారు. అయితే బాక్సాఫీస్ రిజల్టుతో సంబంధం లేకుండా ప్రతి సారి ఏదో ఒక డిఫరెంట్ సినిమాను చేస్తూ తన రేంజ్ మాత్రం పడిపోకుండా చూసుకుంటున్నాడు.

సూపర్ సినిమా చేసి ఆ తర్వాత శ్రీరామదాసు సినిమా చేయడం ఆయనకే చెల్లింది. నాగ్ సినిమా వస్తోంది అంటే ఆడియోన్స్ ఇమేజ్ తో కాకుండా కంటెంట్ తో ఎట్రాక్ట్ అయ్యేలా చేసుకున్నాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం మార్కెట్ ను కాపాడుకోవాలి అంటే తప్పనిసరిగా ఎంతో కొంత బాక్సాఫీస్ వద్ద నిలదగోక్కుకుంటు ఉండాలి. వరుస అపజయాలు ఎదురైతే మాత్రం మళ్లీ కెరీర్ ను ట్రాక్లోకి తెచ్చుకోవడం కష్టంగా మారుతుంది.

ఇక ప్రస్తుతం నాగార్జున బ్రహ్మాస్త్ర రిజల్ట్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఒక విధంగా ఈ సినిమా సక్సెస్ అవ్వడం అక్కినేని హీరోలకు చాలా ముఖ్యమనే చెప్పాలి. ఇటీవల అక్కినేని నాగచైతన్య అమీర్ ఖాన్ నటించిన సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించాడు. అది ఏ విధంగాను కలిసి రాలేదు. అటు కమర్షియల్ గాను ఇటు నటన పరంగాను అతనికి ఏ విధంగానూ సినిమా పాజిటివ్ అంశాన్ని కలిగించలేదు.

పైగా దారుణమైన ట్రోలింగ్ కి కూడా గురయ్యాడు. ఇప్పుడు నాగార్జున చైతు బాధను తీర్చే విధంగా బ్రహ్మస్త్ర సినిమాతో రెండు విధాలుగా సక్సెస్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవ్వడమే కాకుండా ఆయనకు మరింత క్రేజ్ తీసుకు వస్తే చైతు బాధను ఫాన్స్ అంత మరిచిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇది కూడా డిజాస్టర్ అయితే మాత్రం పరిస్థితి ఊహించని విధంగానే ఉంటుంది.

దానికి తోడు రాబోయే రోజుల్లో అఖిల్ మొదటి ఫ్యాన్ ఇండియా సినిమా ఏజెంట్ తో హిందీ మార్కెట్లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. కాబట్టి తండ్రి సక్సెస్ కొడితే చిన్న కొడుకు కూడా కాస్త ఎనర్జిటిక్ గా ముందు అడుగు వేయవచ్చు. బ్రహ్మాస్త్ర ఫేమ్ నాగార్జున కొడుకు అంటే.. బాలీవుడ్ లో ఎంతో కొంత ఫోకస్ అయితే పడుతుంది. మరి నాగార్జున బ్రహ్మాస్త్ర సినిమా ద్వారా ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News