అంద‌రూ డ‌కాయిట్లే..మ‌రి తోపు ఎవ‌రో?

Update: 2022-02-13 08:30 GMT
రాక్ స్టార్ ర‌ణ‌బీర్ క‌పూర్ ని బిగ్ స్ర్కీన్ పై చూసుకుని నాలుగేళ్లు అవుతుంది. `సంజు` తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న రాక్ స్టార్  ఏకంగా నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. మ‌ధ్య‌లో రెండేళ్లు క‌రోనా కార‌ణంగా ఎలాంటి కొత్త  క‌మిట్ మెంట్లు జ‌ర‌గ‌లేదు. అప్ప‌టికే ఒప్పుకున్న ప్రాజెక్ట్ ల్ని పూర్తిచేసే ప‌నిలో ప‌డ్డారు. ఎట్ట‌కేల‌కు ఈ ఏడాది `షంషేరా`..`బ్ర‌హ్యాస్ర్త‌` చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముంద‌కు రావ‌డానికి రెడీ అవుతున్నారు.

`బ్ర‌హ్మాస్ర్త` సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ అవుతుండ‌గా..చాలా కాలంగా వాయిదా ప‌డుతోన్న `షంషేరా` కూడా ఎట్ట‌కేల‌కు రిలీజ్  తేదీని లాక్ చేసుకుంది. జులై 22న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

హిందీ..త‌మిళం..తెలుగు భాష‌ల్లో పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన‌ అధికారిక స‌మాచారాన్ని చిత్ర నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ ఫిలిమ్స్ రివీల్ చేసింది. జులై 22న ఒక లెజెండ్ ఉద‌యిస్తుంది. సూప‌ర్ స్టార్ ర‌ణ‌బీర్ మీ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటాడ‌ని తెలిపారు. ఇప్ప‌టికే టీజ‌ర్ రిలీజ్ తో సినిమాపై అంచ‌నాలు అంకంత‌కు పెరుగుతున్నాయి.  ఇందులో అంద‌రూ డ‌కాయిట్లే.

ర‌ణ‌బీర్ క‌పూర్ ..వాణీ క‌పూర్..సంజ‌య్ ద‌త్ పాత్ర‌లు చాలా ఆస‌క్తిగా సాగుతాయ‌ని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ట్యాగ్ లైన్ క్యూరియాసిటీ పెంచేస్తోంది. `క‌ర‌ణ్ సే దాకైత్..ధ‌ర‌మ్ సే ఆజాద్` అనే ట్యాగ్ లైన్ ఆక‌ట్టుకుంటుంది.

ర‌ణ‌బీర్ క‌పూర్ డ‌కాయిట్ గా న‌టించ‌డం ఇదే తొలిసారి. ఇప్ప‌టికే  డిఫ‌రెంట్ రోల్స్ పోషించిన ర‌ణ‌బీర్ కి డ‌కాయిట్ రోల్ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ని  తీసుకొస్తుంద‌ని యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తోంది.

 అలాగే వాణీ క‌పూర్ రొమాంటిక్ పెర్పార్మెన్స్ సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని అంటున్నారు. థ‌ర్డ్ వేవ్ పూర్తిగా ముగియ‌గానే సినిమాకి  సంబంధించి  ప్ర‌చారం ప‌నులు స్పీడ‌ప్ చేసే అవ‌కాశం ఉంది. ఈ చిత్రానికి క‌ర‌ణ్ మ‌ల్హోత్రా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News