బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా మూవీ "బ్రహ్మాస్త్ర". అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో మూడు భాగాలుగా ఈ సినిమా ప్లాన్ చేయబడింది. ఫస్ట్ పార్ట్ ని "బ్రహ్మాస్త్రం: శివ" పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
'బ్రహ్మాస్త్రం' సినిమాలో రణ్ బీర్ కపూర్ - అలియా భట్ జంటగా నటించగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ - కింగ్ అక్కినేని నాగార్జున - మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ స్పెషల్ అప్పీయరన్స్ ఇచ్చారు.
స్టార్ స్టూడియోస్ - ధర్మ ప్రొడక్షన్స్ - ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్ లైట్ పిక్చర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ చిత్రాన్ని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దక్షిణాదిలో సమర్పించారు.
ఇప్పటికే విడుదలైన 'బ్రహ్మాస్త్ర' టీజర్ - ట్రైలర్ - పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో కింగ్ నాగ్ - రాజమౌళి భాగమవ్వడం.. తెలుగు రాష్ట్రాల్లో దూకుడుగా ప్రమోషన్స్ చేయడంతో తెలుగులోనూ ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది.
బాయ్ కాట్ ట్రెండ్ ఉన్నప్పటికీ ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. దీనికి తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయి. 'బ్రహ్మాస్త్ర' భారీ అంచనాల నడుమ ఈరోజు (సెప్టెంబర్ 9) హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.
ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. పురాతనకాలంలోని వానరాస్త్ర - నంది అస్త్ర - ప్రభాస్త్ర - జలాస్త్ర - పవనాస్త్ర మరియు బ్రహ్మాస్త్రల విశిష్టతను తెలియజేస్తూ.. అస్త్రాలలోకెళ్లా శక్తివంతమైన బ్రహ్మాస్త్ర గురించి.. ఇవి ప్రస్తుత కాలంలో ఏ రూపాల్లో ఉనికిలో ఉన్నాయనేది ఈ సినిమాలో చూపించారని తెలుస్తోంది
'బ్రహ్మాస్త్ర' ఫస్ట్ హాఫ్ హై ఆక్టేన్ యాక్షన్ తో ఆకట్టుకున్నట్లు ట్విట్టర్ టాక్ ని బట్టి అర్థమవుతోంది. రియల్ లైఫ్ కపుల్ రణ్ బీర్ - అలియా మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందంటున్నారు. డీజే శివగా అగ్ని అస్త్రగా రణబీర్.. నంది అస్త్రగా నాగార్జున అద్భుతమైన నటన కనబరిచారని తెలుస్తోంది.
సూపర్ నేచురల్ పవర్డ్ సైంటిస్ట్ మోహన్ గా షారుఖ్ ఖాన్ కనిపించాడు. అమితాబ్ ఎంట్రీతో ఇంటర్వెల్ ఎపిసోడ్ ఇంటెన్స్ గా మారింది. భారీ క్లైమాక్స్ - ప్రీ క్లైమాక్స్ సీన్స్ బాగున్నాయని నెటిజన్స్ అంటున్నారు. యాక్షన్ మరియు వీఎఫ్ఎక్స్ వర్క్స్ అద్భుతమని కొనియాడుతున్నారు. కొన్ని షాట్స్ మార్వెల్స్ రేంజ్ లో ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు.
అయితే స్టోరీకి తగ్గ డైలాగ్స్ లేకపోవడం.. ఎమోషన్స్ పండకపోవడం ఈ సినిమాకు మైనస్ అని అంటున్నారు. అలానే కొన్ని ఫైట్స్ లెన్తీగా ఉండటంతో రిపీట్ అయిన ఫీలింగ్ కలుగుతుందని అభిప్రాయ పడుతున్నారు. ఓవరాల్ గా 'బ్రహ్మాస్త్ర' అనేది బిగ్ స్క్రీన్ పై చూడగలిగే సగటు చిత్రమని రివ్యూ ఇస్తున్నారు.
రణబీర్ - అలియా - అమితాబ్ - నాగ్ - షారుఖ్ వంటి భారీ కాస్టింగ్ తో అద్భుతమైన విఎఫ్‌ఎక్స్ - గ్రాండ్యుర్ విజువల్స్ మరియు ప్రత్యేకమైన కథాంశంతో కూడిన 'బ్రహ్మాస్త్ర' సినిమాని.. తప్పకుండా కుటుంబ సమేతంగా చూడటానికి ప్రయత్నించవచ్చని ప్రేక్షకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.