మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. పివిపి సినిమాస్ పతాకంపై పివిపి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాని ప్రారంభమే తెలుగు - తమిళ్ ద్విభాషా చిత్రంగా ప్రకటించారు. కానీ వాస్తవంలో ప్రాక్టికల్ గా అది వర్కవుటవ్వడం లేదని సమాచారం. ఈ సినిమా కథ ప్రకారం .. తెలుగు నేటివిటీ - తెలుగు కల్చర్ - దేవీ ఉత్సవాలు నేపథ్యంలో తెరకెక్కించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు తమిళ వెర్షన్ ని బ్యాలెన్స్ చేయాలంటే అదనంగా ఎక్కువ స్ర్టెయిన్ తీసుకోవాల్సొస్తోంది. పైగా ఇందులో భారీ కాస్టింగ్ నటిస్తున్నారు. అదే ఇప్పుడు బోలెడంత చిక్కులు తెచ్చిపెడుతోంది. రెండు భాషల్లో ఒకేసారి అంటే కష్టమే అవుతోందిట.
కాజల్ - సమంత - ప్రణీత - సత్యరాజ్ - జయసుధ - రేవతి - నరేష్ - బ్రహ్మాజీ లాంటి స్టార్లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. వీరంతా తెలుగు, తమిళ్ లో ఫుల్ బిజీ ఆర్టిస్టులు. అందుకే కాల్షీట్లను ఒకేసారి సర్ధుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇది దాదాపు కష్టంగా ఉందని తెలుస్తోంది. అదనంగా బోలెడంత సమయం వృథా అవుతోందిట. అందుకే ప్రస్తుతం తెలుగు వెర్షన్ మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. మొదట తెలుగు వెర్షన్ పూర్తయ్యాక అనువాద కార్యక్రమాలకు సదరు నటీనటుల్ని పూర్తి స్థాయిలో కో-ఆపరేట్ చేయాల్సిందిగా మేకర్స్ కోరారు. మహేష్ కి తమిళ్ ఫ్లూయెంట్ గా వచ్చు .. కాబట్టి అనువాదం చెప్పేస్తాడు. అదే తరహాలో మిగతా ఆర్టిస్టులు చేయాల్సి ఉంటుంది.