బాహుబ‌లి చూపిస్తూ స‌ర్జ‌రీ చేశారు!

Update: 2017-10-01 08:15 GMT
కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో పేషెంట్ కు శ‌స్త్ర చికిత్స చేసే స‌మ‌యంలో డాక్ట‌ర్లు ఈ మ‌ధ్య వినూత్న ప‌ద్ధ‌తులను అనుస‌రిస్తున్నారు. జులైలో బెంగుళూరులోని ఓ వ్య‌క్తి గిటార్ వాయిస్తుండ‌గా అత‌డి మెద‌డులో ఓ భాగానికి స‌ర్జ‌రీ చేశారు. గ‌త నెల‌లో చెన్నైలోని ఓ చిన్నారి క్యాండీ క్ర‌ష్ ఆడుతుండ‌గా ఆమె మెద‌డులో క‌ణితిని వైద్యులు శ‌స్త్ర చికిత్స చేసి తొల‌గించారు. అదే త‌ర‌హాలో గుంటూరులో ఆప‌రేష‌న్ థియేట‌ర్ లో బాహుబ‌లిని ప్ర‌ద‌ర్శించారు. ఓ మ‌హిళ బాహుబ‌లి సినిమా చూస్తుండ‌గా ఆమెకు వైద్యులు విజ‌య‌వంతంగా శ‌స్త్రచికిత్స నిర్వ‌హించారు. రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఈ త‌ర‌హా ఆప‌రేష‌న్ నిర్వ‌హించ‌డం ఇదే తొలిసారి అని వైద్యులు తెలిపారు.

ప్ర‌కాశం జిల్లాకు చెందిన స్టాఫ్ న‌ర్సు విజ‌య‌కుమారికి ఫిట్స్ వ‌చ్చాయి. దీంతో, ఆమె మెద‌డులో ర‌క్తం గ‌డ్డ క‌ట్టిన‌ట్లు ఎంఆర్ ఐ స్కానింగ్ లో తేలింది. కుటుంబ సభ్యులు ఆమెను గుంటూరులోని తుల‌సి మ‌ల్టీ స్పెషాలిటీ హాస్ప‌ట‌ల్ కు తీసుకువెళ్లారు. ఆమెను ప‌రిశీలించిన వైద్యులు ఆ గ‌డ్డ‌ను తొల‌గించేందుకు శ‌స్త్ర చికిత్స చేయాల‌ని నిర్ణయించారు. అయితే, ఆప‌రేష‌న్ చేసే స‌మ‌యంలో విజ‌య కుమారి మెల‌కువ‌తోనే ఉండాలి. దీంతో, వినూత్నంగా ఆలోచించిన వైద్యులు ఆమె ఆప‌రేష‌న్ స‌మ‌యంలో బాహుబ‌లి సినిమా చూసేందుకు ప్ర‌త్యేక ఏర్పాటు చేశారు. ఆమె సినిమా చూస్తుండగా వైద్యులు దాదాపు గంట‌న్న‌ర‌పాటు శ్ర‌మించి ఆప‌రేష‌న్ ను విజ‌య‌వంతంగా పూర్తి చేశారు. ఆప‌రేష‌న్ పూర్తయిన త‌ర్వాత ఆస్ప‌త్రి వ‌ర్గాలు ఈ విష‌యాన్ని మీడియాకు వెల్ల‌డించాయి. ప్ర‌స్తుతం విజ‌య కుమారి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

Full View
Tags:    

Similar News