వీడియో : స్టార్‌ సింగర్‌ కు స్వేచ్చ.. అభిమానుల వేడుక

Update: 2021-11-16 06:09 GMT
ప్రపంచ ప్రసిద్ది గాంచిన పాప్ గాయని బ్రిట్నీ స్పియర్‌ కు స్వేచ్చా.. స్వాతంత్ర్యం లభించింది. 39 ఏళ్ల ఈమె ఇన్నాళ్లు తండ్రి సంరక్షణలో ఉంటూ వచ్చింది. 13 ఏళ్ల క్రితం ఆమె ఆరోగ్య.. మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో పాటు పలు ఇతర సమస్యల కారణంగా ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండగా ఆమెకు సంబంధించిన పూర్తి సంరక్షణ బాధ్యతలను కోర్టు ఆమె తండ్రికి అప్పగించింది. అప్పటి నుండి ఆమె తండ్రి నుండి స్వేచ్చ పొందడం కోసం ప్రయత్నాలు చేస్తోంది. తాను పూర్తి ఆరోగ్యంగా.. మానసికంగా బలంగా ఉన్నప్పటికి కోర్టు మాత్రం ఆమెకు స్వేచ్చను ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. ఆమె తండ్రి సంరక్షణలోనే ఉండాల్సిందే అంటూ కోర్టు ఖరాఖండిగా చెప్పేసింది.

కోర్టు విధించిన 13 ఏళ్ల గడవు పూర్తి అయ్యింది. తండ్రి సంరక్షణలో ఉన్న సమయంలో తన పిల్లలను కలుసుకోవడం మొదలుకుని ప్రతి విషయంలో కూడా బ్రిట్నీ స్పియర్‌ ఆంక్షలను ఎదుర్కొంది. మళ్లీ పెళ్లి చేసుకోవడం కోసం ఆమె తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. కాని ఆమె తండ్రి సంరక్షకుడి హోదాలో ఉండి పెళ్లికి అడ్డుకున్నాడు. ఆమెకు సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని కూడా తండ్రి తీసుకునేలా కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆమె ఏం చేయలేక పోయింది. ఆమె వందల వేల కోట్ల ఆస్తులను కూడా ఆమె తండ్రి ఇన్నాళ్లు చూసుకుంటూ వచ్చాడు. తన కూతురు వ్యవహారాలను సరిగ్గా చూసుకుంటున్నాను అని.. ఆమెకు అన్యాయం కలిగించే విధంగా తాను ఎప్పుడు వ్యవహరించలేదు అనేది ఆమె తండ్రి వాదన.

బ్రిట్నీ స్పియర్ మాత్రం తన తండ్రి వల్ల తాను మానసికంగా చాలా ఇబ్బందికి గురి అవుతున్నట్లుగా చెప్పుకొచ్చింది. 2008 నుండి తండ్రి సంరక్షణ లో ఉన్న బ్రిట్నీ స్పియర్‌ ఎన్నో షో లు చేయాలనుకున్నా కూడా ఆమె తండ్రి అడ్డు చెప్పే వాడు. అభిమానులతో కూడా ఎక్కువగా కలవనిచ్చేది కాదు. అందుకే ఆమె కు స్వేచ్చ లభించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. లాస్ ఏంజిల్స్ లోని కోర్టు ప్రాంగణంలో ఆమె అభిమానులు సందడి చేశారు. తమ అభిమాన పాప్ గాయనికి తండ్రి సంరక్షణ నుండి ఉపశమనం లభించడంతో వారు వేడుక చేసుకుంటున్నారు. తనకు దక్కిన స్వేచ్చ ను వేడుకగా జరుపుకుంటున్న అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.





Tags:    

Similar News