ఫస్ట్ లుక్: బ్రోచే స్నేహితులు

Update: 2019-03-21 05:53 GMT
మెంటల్ మదిలో ద్వారా విభిన్నమైన ప్రేమ కథతో మొదటి మూవీతోనే మెప్పించిన దర్శకుడు వివేక్ ఆత్రేయ రెండో సినిమా బ్రోచేవారెవరురా షూటింగ్ పూర్తి చేసుకునే క్రమంలో హోలీ పండగ సందర్భంగా టీం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. శ్రీవిష్ణు హీరోగా రాహుల్ రామకృష్ణ ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ కాన్సెప్ట్ సినిమా రంగం చుట్టూ ఉంటుందని ట్యాగ్ లైన్ తో పాటు థీమ్ ని ప్రెజెంట్ చేస్తూ క్లూస్ ఇచ్చిన తీరు ఆకట్టుకునేలా ఉంది.

హీరోయిన్ ని కాకుండా ముగ్గురు స్నేహితులను హై లైట్ చేశారు అంటే కథలో ఫ్రెండ్ షిప్ థ్రెడ్ బలంగా ఉన్నట్టుంది. నివేదా థామస్ శ్రీవిష్ణుకి జంటగా నటిస్తున్న ఈ మూవీలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా యూనిట్ చెబుతోంది.  పాత బజాజ్ స్కూటర్ మీద ముగ్గురు వెళ్తున్న సెటప్ చూస్తుంటే ఇదేదో కాస్త కాలాన్ని వెనక్కు జరిపి తీసిన కాన్సెప్ట్ గా తెలుస్తోంది.

సినిమా రంగానికి లింక్ పెట్టారు కాబట్టి అందులో నుంచే హ్యూమర్ పుట్టించినట్టున్నారు. రొటీన్ కు భిన్నంగా రోల్స్ ఎంచుకుంటాడనే పేరున్న శ్రీవిష్ణు దీని మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. పోస్టర్ లోనే ఇంత ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి రాహుల్ రామకృష్ణ ప్రియదర్శిలకు మరోసారి మంచి పెర్ఫార్మన్స్ కు స్కోప్ దక్కినట్టు ఉంది.విడుదల తేదీ ఇంకా ఖరారు కానీ బ్రోచేవారెవరురా మే లేదా జూన్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి
Tags:    

Similar News