బ్రూస్ లీ ఆడియో.. ఒక్కమాటలో చెప్పాలంటే.. మేకింగ్ వీడియోతోనే ట్యూన్స్ ఎలాఉన్నాయో ఇచ్చేశారు. సరిగ్గా మ్యూజిక్ లాంఛ్ కానుండగా.. బ్రూస్ లీలో పాటల మేకింగ్ వీడియోలను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. సాధారణంగా రామ్ చరణ్ సినిమాలంటే.. మ్యూజిక్ మేకింగ్ కంటే ఎట్రాక్షన్ గా కనిపిస్తుంది. కానీ బ్రూస్ లీ మేకింగ్ లో మాత్రం.. విజువల్స్ - పిక్చరైజేషన్ కంటే మ్యూజిక్కే ఆకట్టుకోవడం హైలైట్.
ముఖ్యంగా స్టార్టింగ్ లోనే 'రన్.. లైఫంత రేసురా రన్' అంటూ సాగే ఇంట్రడక్షన్ సాంగ్ మొత్తం ఆల్బంకే స్పెషల్ అనిపించేలా ఉంది. 'రియా రియా ముద్దొస్తున్నావే' అంటూ ఫారిన్ లోనే తీసిన డ్యూయట్ లో మాడ్యులేషన్ డిఫరెంట్ గా ట్రై చేశారు. 'కుంగ్ ఫూ కుమారీ.. గంటకోసారి' అంటూ సాగే 'మెగా మీటర్' డ్యూయట్ మాంచి మాస్ బీట్ తో కుమ్మేశాడు తమన్. ఈ పాటలో చెర్రీ డ్యాన్సులు ఇరగదీశాడని ఇంట్రో ఇచ్చేశారు.
లే చలో రొమాంటిక్ డ్యూయట్ గతంలో రిలీజ్ చేశారు. ఈ పాట ఇప్పటికే రికార్డ్ వ్యూస్ దక్కించుకుంది. బ్రూస్ లీ ది ఫైటర్ కోసం... తమన్ తన ట్యాలెంట్ అంతా ఉపయోగించేశాడని అర్ధమవుతోంది. ముఖ్యంగా ఆడియో మిక్సింగ్ కోసం అమెరికా వెళ్లాడు కూడా. ఆ ఎఫెక్ట్ బాగానే కనిపిస్తోంది.