బుల్లెట్ బండిని సినిమాలో చూపించడం కోసం..!

Update: 2021-09-25 10:30 GMT
మూడు నాలుగు నెలలుగా ఎక్కడ చూసినా కనిపిస్తున్న.. వినిపిస్తున్న పాట నీ బుల్లెట్ బండెక్కి వచ్చెత్తప్పా. ఈ పాట అప్పటికే పీక్స్ లో ఉందంటే ఒక కొత్త పెళ్లి కూతురు తన పెళ్లి బరాత్ లో పెళ్లి కొడుకును ఉద్దేశించినట్లుగా ఆ పాటకు డాన్స్ చేయడంతో పాట మరింత పాపులర్ అయ్యింది. యూట్యూబ్‌ లో అఫిషియల్‌ గా వంద మిలియన్ ల వ్యూస్‌ కు చేరువ అయ్యింది. ఇక ఆ పాటకు కవర్ సాంగ్స్.. షార్ట్‌ వీడియోలు ఇలా అన్ని కలిపి వెయ్యి మిలియన్ లు అయినా ఆశ్చర్యం లేదు. సోషల్ మీడియాలో ఇంతగా ఈ పాట పాపులారిటీని దక్కించుకుంది. మోహన భోగరాజు పాడిన ఈ పాట ఆమె సొంత యూట్యూబ్‌ ఛానెల్‌ లోనే ఉంది. పెద్ద ఎత్తున ఆదాయం ఆ పాట ద్వారా మోహనకు వచ్చే ఉంటుంది.. ఇంకా వస్తూనే ఉంటుంది. ఆ పాట రాయల్టీలు కూడా భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పాటకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు గాను సినిమా ఇండస్ట్రీ వర్గాల వారు ప్రయత్నాలు చేస్తున్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పలువురు ఫిల్మ్‌ మేకర్స్ కు చెందిన మేనేజర్ లు మద్య వర్తులు మోహనను కలిసి ఆ పాట రైట్స్ తమకు ఇవ్వాలంటూ కోరడం జరిగిందట. అందుకు గాను లక్షల ఆఫర్‌ ను కూడా ఆమెకు చేశారని టాక్‌ వినిపిస్తుంది. తమ సినిమాలో ఆ పాటను పెట్టుకుని పబ్లిసిటీ దక్కించుకోవాలని మేకర్స్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. బుల్లెట్‌ బండి సూపర్‌ హిట్ అవ్వడం వల్ల తమ సినిమాలో ఆ పాట పెట్టడం వల్ల సినిమా కూడా హిట్ అవుతుందని కూడా కొందరు ఆమెను సంప్రదించే ప్రయత్నం చేశారట. ఇటీవల మోహన ఒక చిట్ చాట్‌ లో ఈ విషయాన్ని వెళ్లడించారట. ఆమె ను చాలా మంది ఈ పాట కోసం సంప్రదిస్తున్నారట... కాని ఆమె మాత్రం ప్రస్తుతానికి పాటను తన వద్దే ఉంచుకుందని.. తన యూట్యూబ్‌ ఛానెల్‌ లోనే ఆ పాట ఉంచుకోవాలని అనుకుంటుందట.

పాటకు వచ్చిన రెస్పాన్స్ తో ఒక్కసారిగా మోహన భోగరాజు కు సినిమాల్లో పాడే ఆఫర్లు కూడా వరుస పెట్టి వస్తున్నాయి. ముందు ముందు ఈమె నుండి పెద్ద హీరోల సినిమాల నుండి చిన్న హీరోల సినిమాల పాటల వరకు చాలానే రాబోతున్నాయి. ఇతర పాటల విషయం ఏమో కాని బుల్లెట్‌ బండి పాట సినిమాల్లో వేస్తే చూడాలని కొందరు ఆశిస్తున్నారు. పూర్తి రైట్స్ ఇచ్చేయకుండా తన పాటకు కవర్ లా చేసుకునేలా అవకాశం మోహన ఇస్తే బాగుంటుందని కొందరు అంటున్నారు. సినిమాలో వాడుకోవడం వల్ల రాయల్టీ రావడంతో పాటు తన పాట తన వద్దే ఉంటుంది. ఈ విషయంపై ఆలోచించాలని కొందరు ఆమెకు సూచిస్తున్నారట. మరి మోహన ఈ పాటను మరింత మందికి చేరుకు అయ్యేలా వెండి తెరపైకి తీసుకు వెళ్లేందుకు ఒప్పుకుంటుందా అనేది చూడాలి.
Tags:    

Similar News