బిగ్ బాస్ 8 : విన్నర్ అన్నారు.. నాల్గవ స్థానంలోనే బయటకు..!
బిగ్ బాస్ సీజన్ 8 లో టాప్ ఫైవ్ నుంచి నేడు విజేతని ప్రకటించబోతున్నారు. నిఖిల్, గౌతం ల మధ్య టైటిల్ ఫైట్ జరుగుతుంది.
బిగ్ బాస్ సీజన్ 8 లో టాప్ ఫైవ్ నుంచి నేడు విజేతని ప్రకటించబోతున్నారు. నిఖిల్, గౌతం ల మధ్య టైటిల్ ఫైట్ జరుగుతుంది. ఐతే సీజన్ 8 లో విన్నర్ ఎవరన్నది ఎపిసోడ్ మరో మూడు గంటల ముందు మొదలు కాబోతున్నా కూడా తెలియకుండా లీక్ కాకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 లో విన్నర్ ఎవరైనా సరే అది ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేలా ఉంది. ఐతే లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం ప్రకారం టాప్ 5 కాస్త టాప్ 3 గా మారినట్టు తెలుస్తుంది.
టాప్ 5 నుంచి మరో ఇద్దరిని హౌస్ నుంచి ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తుంది. టాప్ 5 గా అవినాష్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. UI సినిమాను ప్రమోట్ చేస్తూ బిగ్ బాస్ షోకి వచ్చారు కన్నడ స్టార్ ఉపేంద్ర. ఆయన హౌస్ లోకి వెళ్లి అవినాష్ ని బయటకు తెచినట్టు తెలుస్తుంది. మరోపక్క టాప్ 5 లో ఉన్న ఒకే ఒక్క మహిళా కంటెస్టెంట్ ప్రేరణ కూడా టాప్ 4 గా వెనుతిరిగినట్టు తెలుస్తుంది. ఈసారి లేడీ విన్నర్ గా ప్రేరణ టైటిల్ గెలుస్తుందని అనుకున్నారు.
కానీ ఆమెను టాప్ 4లో మాత్రమే ఉంచారు ఆడియన్స్. 15 వారాల ఆటలో ఆడియన్స్ కు దగ్గరైన ప్రేరణ ఫైనల్ ఓటింగ్ లో 9 శాతం ఓట్లతో టాప్ 4 లో నిలిచింది. ఐతే ఆమెకు ఈ 15 వారాలు ఉన్నందుకు గాను దాదాపు 28 లక్షల దాకా రెమ్యునరేషన్ అందుతున్నట్టు తెలుస్తుంది. వారానికి 2 లక్షల చొప్పున ప్రేరణ రెమ్యునరేషన్ మాట్లాడుకున్నారట. అలా 28 నుంచి 30 లక్షల దాకా ఆమె పారితోషికం సంపాదించినట్టు తెలుస్తుంది.
ఇక విన్నర్ పర్సంటేజ్ అన్ అఫీషియల్ పోల్స్ లో ఒకసారి గౌతం, మరోసారి నిఖిల్ ఉన్నారు. ఐతే వీరిద్దరిలో ఎవరు విన్నర్ అవుతారు అన్నది మరికొద్ది గంటల్లో తెలుస్తుంది. ఐతే ఈసారి సీజన్ టైటిల్ విన్నర్ అయిన వారికి 55 లక్షల ప్రైజ్ మనీతో పాటు బ్రీజా కారు కూడా గిఫ్ట్ గా ఇస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ విన్నర్ ఎవరనే ఆసక్తితో బిగ్ బాస్ లవర్స్ ఈగర్ గా ఉన్నారు. ఐతే లాస్ట్ సీజన్ విన్నర్ అనౌన్స్ మెంట్ తర్వాత పోలీసులకు, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే ఈసారి విన్నర్ ఎవరైనా ఎలాంటి ర్యాలీలు లేకుండా సైలెంట్ గా వెళ్లిపోవాల్సిందే అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.