పుష్ప 1 కన్నా పుష్ప-2 లాభాలు తక్కువేనా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప 2: ది రూల్ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ అదరగొడుతోంది.

Update: 2024-12-15 09:30 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప 2: ది రూల్ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ అదరగొడుతోంది. ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి దూసుకుపోతోంది. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ రికార్డును బ్రేక్ చేసి అలరిస్తోంది.

2024లో భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన పుష్ప-2.. రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో రాణిస్తోంది. ముఖ్యంగా నార్త్ లో నెవ్వర్ బిఫోర్ అనేలా దూసుకుపోతోంది. త్వరలో ఓ క్రేజీ రికార్డును బద్దలు కొట్టనుంది. ఇప్పటి వరకు నార్త్ లో బాహుబలి-2 రూ.511 కోట్ల వసూళ్లు రాబట్టగా.. పుష్ప-2ను ఆ రికార్డును ఆదివారం బ్రేక్ చేయనుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

అయితే పుష్ప ఫస్ట్ పార్ట్ కూడా నార్త్ లో వేరే లెవెల్ హిట్ అయిన విషయం తెలిసిందే. మేకర్స్ కు లాభాల పంట పండించింది. 2021లో రిలీజ్ అయిన ఫస్ట్ పార్ట్ హిందీ వెర్షన్ కోసం అప్పట్లో మేకర్స్ రూ.20 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. హిందీ ప్రియులను ఓ రేంజ్ లో అలరించిన పుష్ప-1.. రూ.106 కోట్లను వసూలు చేసింది. అంటే రూ.86 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది.

అంటే ఖర్చు తక్కువగానే పెట్టినా.. లాభాలు ఓ రేంజ్ లో వచ్చాయని చెప్పాలి. దాదాపు 430 శాతం ప్రాఫిట్స్ ను మేకర్స్ కు అందించింది పుష్ప-1. అదే సమయంలో ఇప్పుడు నార్త్ లో పుష్ప సీక్వెల్ వసూళ్ల గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. సీక్వెల్ హిందీ వెర్షన్‌ కోసం మేకర్స్ దాదాపు రూ.200 కోట్లను ఖర్చు పెట్టారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు హిందీ బెల్ట్ లో రూ.250 కోట్లకుపైగా రాబట్టింది పుష్ప 2.

ప్రస్తుతానికి లాభాల శాతం 120%గా ఉందనే చెప్పాలి. ఇది చాలా పెద్ద విషయమే. కానీ ఫస్ట్ పార్ట్ కన్నా మాత్రం లాభాల శాతం తగ్గింది. పార్ట్-1లాగా లాభాలు రావాలంటే బాక్సాఫీస్ వద్ద రూ.1060 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం మంచి రెస్పాన్స్ వస్తున్నా.. కేవలం హిందీలో రూ.1000 కోట్ల మార్క్ ను పుష్ప-2 టచ్ చేయడం కష్టమే. మరి చివరకు ఎంతటి వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.

ఇక సినిమా విషయానికొస్తే.. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రవిశంకర్, నవీన్ నిర్మించారు. అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించారు. యంగ్ హీరోయిన్ శ్రీలీల ఐటెం సాంగ్ లో మెరిశారు. ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Tags:    

Similar News