అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా తనకంటూ ఒక స్పెషల్ బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఈ పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుంది. పుష్ప సెకండ్ పార్ట్ కోసం ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బన్నీ తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీ లైఫ్ కు కూడా కొంత టైం ని కేటాయిస్తూ ఉంటాడు.
ఎక్కువగా మాత్రం తన కూతురితోనే బన్నీ టైం స్పెండ్ చేస్తాడు అని చెప్పవచ్చు. తరచుగా అల్లు ఆర్హకు సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఇక ఎంతో అల్లరి చేస్తూ సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆర్హ ఎంత గోల చేస్తుందో మరోసారి అర్థమయింది.
అయితే ఈ రోజు ఆర్హ పుట్టినరోజు కావడంతో అల్లు అర్జున్ ప్రత్యేకంగా సోషల్ మీడియా ద్వారా తన కూతురికి శుభాకాంక్షలు తెలియజేశాడు. అంతేకాకుండా మా ఫ్యామిలీలో ఎంతో సంతోషకరమైన క్యూట్ అమ్మాయి అంటూ ఒక వీడియోను కూడా పోస్ట్ చేశాడు.
ఆర్హ కందిరీగ కథలు చెబుతోంది అని ట్యాగ్ కూడా ఇచ్చాడు. బిల్డింగ్ కింద కొన్ని కందిరీగలు ఉన్నాయని అవి కింద వాళ్లను కుడుతున్నాయి అని అర్హ ఎంతో క్యూట్ గా చెప్పింది.
అయితే వాటిని చూసి భయపడవద్దు అని కూడా బన్నీ తన కూతురికి నవ్వుతూ చెప్పాడు. ఏదేమైనా కూడా బన్నీ కూతురు మాత్రం స్టార్స్ సెలబ్రెటీగా మారిపోయింది. ఇక ఈ క్యూట్ అమ్మాయి వెండితెరపై కూడా నటిగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఆర్హ, గుణశేఖర్ సమంత కలయికలో రాబోతున్న శాకుంతలం సినిమాలో కూడా ఒక చిన్న పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
ఇక ఇంతకుముందు ఓ మై డాడీ అంటూ తండ్రి సినిమాలో కూడా కనిపించింది. సోషల్ మీడియా ద్వారానే వీరికి చాలా మంచి క్రేజ్ దక్కుతోంది. ఇక భవిష్యత్తులో ఆమె నటిగా కూడా మ్యాజిక్ క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View