మన తెలుగు సినిమాల్లో దాదాపుగా హీరోయిన్లు అందరూ నార్త్ నుంచి వచ్చినవారే కానీ వారు బాలీవుడ్ లో టాప్ లీగ్ హీరోయిన్లు కాదు. కానీ ఇప్పుడు మాత్రం ట్రెండ్ కొంచెం మారుతోంది. టాప్ లీగ్ హీరోయిన్లను భారీ రెమ్యూనరేషన్లు ఇచ్చి మరీ తెలుగు సినిమాలలో హీరోయిన్లుగా తీసుకుంటున్నారు. బాలీవుడ్ మార్కెట్ కోసం.. ప్యాన్ ఇండియా అప్పీల్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను ఎంచుకుంటున్నారు. 'సాహో' కోసం శ్రద్ధ కపూర్.. 'RRR' కోసం అలియా భట్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా తన సినిమాకు బాలీవుడ్ టచ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడట.
అల్లు అర్జున్ రీసెంట్ గా మూడు సినిమాలను ప్రకటించాడు. ఆ మూడు ప్రాజెక్టులలో ఒకటి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో.. దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కనున్న 'ఐకాన్'. ఈ సినిమాను ఈ ఏడాది చివరలో సెట్స్ మీదకు తీసుకెళ్ళాలనే ప్రయత్నాలలో ఉన్నారట. ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ అయితే బాగుంటుందని.. వీలైతే అలియా భట్ కానీ ఆ రేంజ్ లో ఉండే వేరే హీరోయిన్ కోసం కానీ ట్రై చేయమని బన్నీ నిర్మాతలకు చెప్పాడట. బన్నీ సినిమాకు బడ్జెట్ ఎక్కువే ఉంటుంది కాబట్టి అలియాను తీసుకున్నా రెమ్యూనరేషన్ ఇబ్బంది ఉండదు.
బన్నీ సినిమాలకు హిందీలో డిమాండ్ ఎక్కువ. యూట్యూబ్ లో బన్నీ సినిమాలకు వచ్చే వ్యూస్ రికార్డు స్థాయిలో ఉంటాయి. అందుకే హిందీ డబ్బింగ్ రైట్స్ రేట్లు భారీ స్థాయిలో ఉంటాయి. ఇక అలియా లాంటి స్టార్ హీరోయిన్ కూడా తోడైతే హిందీలో స్ట్రెయిట్ రిలీజ్ కు కూడా వెళ్ళొచ్చు. ఈమధ్య స్టార్ హీరోలు ఇతర భాషల మార్కెట్ ను పెంచుకునేందుకు ట్రై చేస్తున్నారు కదా..మరి బన్నీ కుడా 'ఐకాన్' తో బాలీవుడ్ పై కన్నేస్తున్నాడేమో.