లేడీ ఎంఎల్ ఎ గారికి బన్నీ సిఫార్సు..?

Update: 2019-03-01 13:06 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసేందుకు రెడీ అవుతున్నాడు.  'నాపేరు సూర్య' తర్వాత కాస్త ఒళ్ళు చేయడంతో ఫిట్నెస్ పై ఫోకస్ చేస్తూ కొత్త సినిమా స్టార్ట్ అయ్యేలోపు ఫిట్ గా మారే ప్రయత్నాలలో ఉన్నాడు. దీంతో పాటుగా ఈ సినిమా నటీనటుల ఎంపిక.. టెక్నిషియన్లను ఫైనలైజ్ చేయడంలో కూడా తన వంతు పాత్ర పోషిస్తున్నాడట.  రీసెంట్ గా ఈ సినిమాకు సెకండ్ హీరోయిన్ పేరును బన్నీ సూచించాడని టాక్.

మెయిన్ లీడ్ గా సాయి పల్లవి నుంచి పూజా హెగ్డే వరకూ ఇప్పటిదాకా చాలా పేర్లే వినిపించాయి.  పూజా హెగ్డేకి హీరోయిన్ అవకాశం ఇవ్వడం దాదాపుగా ఫైనలైజ్ అయినట్టేనని అంటున్నారు. ఇక సెకండ్ హీరోయిన్ విషయానికి వస్తే బ్యూటిఫుల్ కేథరిన్ ట్రెసాను తీసుకుందామని ఫిక్స్ అయ్యారట.  కేథరిన్ తో అల్లు అర్జున్ ఆడిపాడడం ఇది మొదటి సారి కాదు. 'ఇద్దరమ్మాయిలతో'.. 'రుద్రమదేవి'.. 'సరైనోడు' సినిమాల్లో కేథరిన్ నటించింది.  ముఖ్యంగా 'సరైనోడు' సినిమాలో లేడీ ఎంఎల్ఏ పాత్రలో నటించి అందరినీ మెప్పించింది.  ఇప్పుడు మరోసారి బన్నీ-ట్రెసా జోడీ ప్రేక్షకులను ఎంటర్టెయిన్ చేసేందుకు రెడీ అవుతోందన్నమాట.
 
త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.  త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబినేషన్లో గతంలో 'జులాయి'.. 'S/o సత్యమూర్తి' బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించాయి. దీంతో ఈ హ్యాట్రిక్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.  
    

Tags:    

Similar News