ఇటీవలి కాలంలో టాలీవుడ్ నిర్మాతల్లో కొత్త పేర్లు శరవేగంగా పుట్టుకొస్తున్నాయి. 100 పర్సంట్ లవ్, మిర్చి, శ్రీమంతుడు.. ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ని నిర్మించినవాళ్లంతా కొత్తవాళ్లే. వస్తూనే బ్లాక్ బస్టర్లు క్రియేట్ చేశారు. అభిరుచితో, ప్రొడక్షన్ పై గ్రిప్ తో విజయతీరాల్ని చేరుకున్నారు. అల్లు అరవింద్ కాంపౌండ్ నుంచి, దిల్ రాజు కాంపౌండ్ నుంచి, ప్రభాస్ కాంపౌండ్ నుంచి కొత్త నిర్మాతల హవా మొదలైంది. ఇందులో అల్లూ వారి కాంపౌండ్ నుంచి బన్నివాసు పేరు బాగా పాపులర్ అవుతోంది. నిన్నగాక మొన్న రిలీజైన భలే భలే మగాడివోయ్ చిత్రాన్ని బన్ని వాసు నిర్మించాడు. జిఎ 2 బ్యానర్ ని ప్రారంభించి అల్లు అరవింద్ సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మించాడు.
జిఎ 2 సొంత బ్యానర్. ఇలా సొంత బ్యానర్ లో ఆరంగేట్రమే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసినందుకు బన్ని వాసు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. ఈ సినిమా కాన్సెప్టు మూడేళ్ల క్రితమే బన్ని నాకు చెప్పాడు. ఆ తర్వాత మారుతికి చెప్పి డెవలప్ చేయమన్నా. అది భళేగా వర్కవుటైందంటూ వాసు మురిసిపోతున్నాడు. అల్లు అరవింద్ గారితో పరిచయం .. ఆయన ముగ్గురు కొడుకులు వేరే పనుల్లో బిజీగా ఉండడం వల్ల కలిగింది. ఆయనకు అసిస్టెన్సీ చేసిన టైమ్ లో ఎన్నో కాంప్లికేటెడ్ పనుల్ని సునాయాసంగా చేశానని మెచ్చుకునేవారు. అలా మామధ్య సుదీర్ఘ అనుబంధం కొనసాగింది.. అంటూ చెప్పుకొచ్చాడు బన్ని వాసు. చూస్తుంటే అల్లు అరవింద్ అంత ఎదిగేట్టే ఉన్నాడే!