మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ''బటర్ ఫ్లై''. ఇటీవల అనుపమ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. సీతాకోకచిలుక మధ్యలో అందమైన అనుపమ లుక్ ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం 40 సెకన్లతో ఉత్కంఠ భరితంగా 'బటర్ ప్లై' టీజర్ ను కట్ చేశారు. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుందని ఈ వీడియోని బట్టి తెలుస్తోంది. ఓ అపార్ట్‌మెంట్ లోకి అడుగుపెట్టిన అనుపమ.. అక్కడ షాకింగ్ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఎవరో ఆమెను తరుముతున్నట్లు.. ఆమె ఎవరి కోసమే వెతుకుతున్నట్లు టీజర్ లో చూపించారు. బ్యాగ్రౌండ్ స్కోర్ - విజువల్స్ స్పెషల్ గా థ్రిల్లింగ్ కు గురి చేస్తున్నాయి. ఈ 'బటర్ ప్లై' వెనకున్న అసలు కథేంటో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.
''బటర్ ప్లై'' చిత్రానికి ఘంటా సతీష్ బాబు కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం వహించారు. జెన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్ పై రవి ప్రకాష్ బోడపాటి - ప్రసాద్ తిరువళ్లూరి - ప్రదీప్ నల్లిమెల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇందులో భూమిక చావ్లా - నిహాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అర్విజ్ - గిడియన్ కట్టా ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా.. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహించారు. విజయ్ మక్కెన ఆర్ట్ డైరెక్టర్ గా.. మధు ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని అప్ డేట్స్ ను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.