తన మావయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా తన సినిమా చూడనే చూడలేదని అంటాడు సాయిధరమ్ తేజ్. కానీ తేజుతో ‘ఇంటిలిజెంట్’ సినిమా తీసిన నిర్మాత సి.కళ్యాణ్ మాత్రం తేజు కెరీర్ ను ఆరంభం నుంచి పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తున్నాడని.. అతడిని హీరోను చేసిందే పవన్ అని చెప్పడం విశేషం. తేజు హీరో అవ్వాలని అందరికంటే ముందు కోరుకున్నది పవన్ కళ్యాణే అని సి.కళ్యాణ్ చెప్పాడు. అతను ఫస్ట్ సినిమా చేయడానికి ఏ స్క్రిప్టు అయితే బాగుటుందని ఆయనే పరిశీలించాడని.. తేజులో పవన్ తన అన్నయ్యను చూసుకుని.. చిరు లాగే ఇతనూ ఎదగాలని కోరుకున్నాడని కళ్యాణ్ వ్యాఖ్యానించాడు. కానీ తేజును పవన్ ఏ రోజూ పట్టించుకున్నట్లు కనిపించడు. కళ్యాణ్ చెబుతున్న మాటల్లో నిజమెంతో మరి?
‘ఇంటిలిజెంట్’ సినిమాలో ‘చమక్ చమక్ చమ్’ పాటలో సాయిధరమ్ తేజ్ చిరును మ్యాచ్ చేసేలా డ్యాన్స్ చేశాడని.. త్వరలో చిరు చేసిన ఈ పాటను.. తేజు చేసిన పాటను మిక్స్ చేసి ఒక పాట వదులుతామని కళ్యాణ్ అన్నాడు. ఈ సినిమాలో అన్ని పాటల్లోనూ తేజు అదరగొట్టేశాడని.. పాటల్లో డ్యాన్సులు.. కొన్ని సీన్లలో మేనరిజమ్స్ చూస్తుంటే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లి చిరంజీవిని చూస్తున్నట్లు అనిపించిందని కళ్యాణ్ అన్నాడు. ఈ నెల 9న ‘ఇంటిలిజెంట్’ సూపర్ డూపర్ హిట్టవుతుందని.. మెగా ఫ్యామిలీ అందరినీ తీసుకొచ్చి ఈ చిత్రానికి సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తానని ఆయన అన్నారు. వినాయక్ మనసులో ఎంత ఒత్తిడిని ఉన్నా.. పైకి మాత్రం ప్రశాంతంగా కనిపిస్తాడని.. ఆయనతో తాను మరిన్ని సినిమాలు చేస్తానని కళ్యాణ్ అన్నాడు.