ఓటీటీల్ని అలా దాచేయ‌డం కుదురుతుందా?

Update: 2022-09-02 04:03 GMT
ఫిలింఛాంబ‌ర్ ప‌రిధిలో నిర్మాతలు పంపిణీదారులు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన థర్డ్ పార్టీలతో విస్తృతమైన చర్చలు జ‌రిపాక స‌రికొత్త సూచ‌న‌లు నిర్ణ‌యాలు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. ప్రతి సినిమాకు ఎనిమిది వారాల‌ థియేట్రికల్ విండో తప్పనిసరి. ఆ త‌ర్వాతే ఓటీటీలో విడుద‌ల చేయాలి. థియేటర్లలో ఏదైనా సినిమా ప్రారంభమయ్యే ముందు OTT లేదా శాటిలైట్ భాగస్వామి పేర్లను పేర్కొనకూడదు. స్ట్రీమింగ్ భాగస్వామి పేరు కూడా సినిమా ప్రచార సామగ్రిలో ఎక్కడా కనిపించకూడదు. నిజానికి ఇది మంచి నిర్ణయమ‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి.

OTT పేరు ఏదైనా పోస్టర్ లేదా ప్రమోషనల్ మెటీరియల్ లో కనిపించిన వెంటనే కొంతమంది ప్రేక్షకులు థియేటర్ ల‌కు వ‌చ్చే బదులు స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ లో తర్వాత చూడటానికి తమ మనస్సును ప్రిపేర్ చేస్తున్నారు. అందుకే ఈ కొత్త నియమం అంద‌రినీ ప్ర‌భావితం చేస్తుంది. ఓటీటీ కోసం ఎదురు చూడ‌కుండా చేస్తుంద‌ని భావిస్తున్నారు.

ఓటీటీ భ్ర‌మ‌ల్ని తొల‌గించ‌గ‌లిగితే థియేటర్లలో మాత్రమే సినిమాలను చూసేలా చేస్తుందని కూడా భావిస్తున్నారు. అయితే 8 వారాల ముందు స్ట్రీమింగ్ కి అనుమ‌తి లేన‌ప్పుడు క్రెడిట్ లను ప్రారంభించే సమయంలో OTT భాగస్వామి పేర్లను దాచడం వల్ల ప్రయోజనం ఏమిటని కూడా కొందరు అభిప్రాయపడ్డారని తెలిసింది.

అమెజాన్ - నెట్‌ఫ్లిక్స్ లేదా హాట్‌స్టార్ పేరును టైటిల్స్ లో ప్ర‌ద‌ర్శించినంత మాత్రాన‌... దాని వల్ల ఎలాంటి లాభం ఉంటుంది..  తేడా ఏం ఉంటుంది? అన్న వాద‌న కూడా తెర‌పైకొచ్చింది.  అయితే OTT ప్లాట్ ఫారమ్ లు నిర్మాత‌ల వైపు నుంచి ఇలాంటి నియమానికి అంగీకరించే ఛాన్సుందా? అంటే సందేహ‌మే.

ఎందుకంటే వారు సినిమా హక్కులను కొనుగోలు చేసేది బిజినెస్ ని దృష్టిలో పెట్టుకుని ... ఇప్పుడు మారిన రూల్స్ తో వారు ధ‌ర‌ల చెల్లింపుల విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తారు. త‌క్కువ మొత్తాల‌కు సినిమాల‌ను కొనుగోలు చేసేలా  ఒప్పందాలు చేసుకుంటారు.

ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసాక త‌మ బ్రాండ్ ని ప్ర‌చారం చేయ‌నీకుండా ఆపుతామంటే కుదురుతుందా? .. అన్ని పబ్లిసిటీ మెటీరియల్ ల నుండి వారి పేరును దాచడం అంటే సినిమా OTT ప్రీమియర్ సమయంలో వారు ప్రత్యేక ప్రచారం చేయాలంటే ఆ మేర‌కు త‌మ‌పై భారం పెరుగుతుంది. ఆ మేర‌కు ధ‌ర‌ల గురించి ప్ర‌స్థావ‌న‌లో త‌గ్గింపు ఆలోచ‌న‌లు చేస్తార‌ని భావిస్తున్నారు. సంద‌ర్భానుసారం ఓటీటీలు ఆలోచ‌న‌లు మార్చుకోవ‌ని గ్యారెంటీ ఏం ఉంది? అన్న చ‌ర్చా సాగుతోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News