ప్రముఖ తమిళ నటుడు, రజనీకాంత్ అల్లుడు ధనుష్ తమ కొడుకేనంటు మధురైకి చెందిన కదిరేశన్ దంపతులు కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు, నటుడు అయిన కస్తూరి రాజా కుమారుడిగానే ఇంతవరకు ఇండస్ర్టీలో అందరికీ తెలిసిన ధనుష్ పై ఇప్పుడు కొత్తగా అనుమానాలు పొడసూపుతున్నాయి. ఆ వృద్ధ దంపతులు డబ్బు కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నారని ధనుష్ చేసిన వ్యాఖ్యలను చాలామంది నమ్మారు.. కానీ, తాజా పరిణామాలతో అంతా ఇప్పుడు ధనుష్ పైనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
ఈ కేసులో ఇరువర్గాల వాదోపవాదనలు ముగియడంతో మద్రాస్ హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. హీరో ధనుష్ తమ కొడుకేనని వృద్ధాప్యంలోవున్న తమకు మెయింటినెన్స్ కింద నెలకు రూ.65 వేలు ఇప్పించాలని మధురైకి చెందిన కదిరేశన్- మీనాక్షి దంపతులు కోర్టుకు ఎక్కడంతో మొదలైన ఈ గొడవ ధనుష్ డీఎన్ ఏ టెస్టుకు అంగీకరించకపోవడంతో అనుమానాస్పదంగా మారింది. అంతేకాదు.. ధనుష్ తన ఒంటిపై ఉండే పుట్టుమచ్చలను లేజర్ చికిత్సతో తొలగించుకోవడంపైనా అనుమానాలు వస్తున్నాయి.
న్యాయస్థానం ఆదేశాల మేరకు ధనుష్‌ను పరీక్షించిన ప్రభుత్వ డాక్టర్లు లేజర్ టెక్నాలజీ ద్వారా ఆయన తన శరీరంపై ఉన్న పుట్టుమచ్చలను చెరిపేసుకున్నాడని తేల్చారు. ఇటు కదిరేశన్ దంపతులు, అటు ధనుష్ తరపున దాఖలు చేసిన పత్రాలను న్యాయస్థానం క్షుణ్ణంగా పరిశీలించింది. ఐతే, ధనుష్ మాత్రం కదిరేశన్ దంపతులు చేసిన వాదనల్లో నిజంలేదని, తన నుంచి డబ్బు గుంజేందుకే కేసు వేశారని ఆరోపించాడు. ఇదిలావుండగా డీఎన్ఏ టెస్టుకు ధనుష్ ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు దనుష్ మీదనే అందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు వెలువరించే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజంగా ధనుష్ ఆ వృద్ద దంపతుల కుమారుడు కాకుంటే డీఎన్ ఏ టెస్టు చేయించుకోవడానికి భయమెందుకన్న ప్రశ్న వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/