'ఫలక్ నుమా దాస్' ఫేం విశ్వక్ సేన్ హీరోగా కొలను శైలేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థ్రిల్లర్ 'హిట్'. న్యాచురల్ స్టార్ నాని ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై సమర్పిస్తున్నారు. 'చిలసౌ' ఫేమ్ రుహాని శర్మ ఈ సినిమాలో విశ్వక్ కు జోడీగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
ప్రీతీ అనే ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు విచారణ హోమిసైడ్ ఇంటర్ వెన్షన్ టీమ్ లో పని చేసే పోలీస్ ఆఫీసర్ విశ్వక్ సేన్ కు అప్పగిస్తారు. విచారణ చేస్తూనే ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు విశ్వక్. "నీ చుట్టూ జరిగే చిన్నచిన్న విషయాలు నీకు నీ పాస్ట్ ని గుర్తు చేస్తూ ఉన్నాయి. అందుకే ఈ ప్యానిక్ అటాక్స్" అంటూ ఒకరు వాయిస్ ఓవర్ లో చెప్తారు. దీన్ని బట్టి హీరో ప్యానిక్ అటాక్స్ తో బాధపడుతూ ఉంటాడని హింట్ ఇచ్చినట్టే. విచారణలో భాగంగా ఒక పబ్ లో ఏం జరిగిందో తెలుసుకునేందుకు విశ్వక్ ప్రయత్నిస్తూ ఉంటాడు. మరో వైపు "ఒక్కసారి నా గురించి ఆలోచించు విక్కీ.. ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ" హీరోయిన్ విశ్వక్ ను జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉంటుంది. అటు కేసు ఇన్వెస్టిగేషన్.. హెల్త్ ఇష్యూ.. ఇటు ప్రియురాలు.. చివరికి ఏం జరిగింది. అడ్డంకులను ఎదుర్కొని కేసును విజయవంతం గా పరిష్కరించాడా అనేది కథ.
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా థ్రిల్లర్ సినిమాలు చూసేవారికి 'హిట్' కనెక్ట్ అయ్యేలాగానే ఉంది. అమ్మాయిల మిస్సింగ్ కేసులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక బర్నింగ్ ఇష్యూ. సరిగ్గా ఈ సినిమా కథ నడవడం ఆసక్తి కలిగించేదే. విశ్వక్ నటన క్యాజువల్ గా ఉంది. నేపథ్య సంగీతం.. సినిమాటోగ్రఫీ థ్రిల్లర్ థీమ్ కు తగ్గట్టు గా ఉన్నాయి. ఆలస్యం ఎందుకు.. చూసేయండి.
Full View