అమలా పాల్ కారుపై స్పెషల్ దర్యాప్తు

Update: 2017-11-01 07:32 GMT
బిచ్చగాడు మూవీలో కారు కాన్సెప్ట్ ను యాజిటీజ్ గా రియల్ లైఫ్ లో అమలాపాల్ అమలు చేసిందని ఇప్పటికే చెప్పుకున్నాం. ఓ ప్రైవేటు ఛానల్ నిర్వహించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా.. అమలాపాల్ తో పాటు ఫాహద్ ఫాజిల్ వంటి మరికొందరు స్టార్స్.. ఇలా పాండిచ్చేరి లో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇతర ప్రాంతాల్లో కార్లను తిప్పుతున్న వ్యవహారం బైటపడింది.

అమలాపాల్ వాడుతున్న కారు ఖరీదు కూడా తక్కువేమీ కాదు. ఇది 1.12 కోట్ల రూపాయల బెంజ్ కారు. అది ఓకే కానీ.. దీన్ని కేరళలోనో.. చెన్నైలోనో రిజిస్టర్ చేయిస్తే.. కనీసం 20 లక్షల రూపాయల రోడ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. దీనికి బదులుగా ఆమె పాండిచ్చేరిలో ఓ తప్పుడు అడ్రెస్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైనం బైటపడింది. దీనిపై అక్కడి గవర్నర్ కిరణ్ బేడీ ఇప్పుడు విచారణకు ఆదేశించారు. ఒక కారు వ్యవహారంపై గవర్నర్ స్థాయి వ్యక్తి విచారణకు ఆదేశించడం బహుశా చరిత్రలో ఇదే మొదటి సారి కావచ్చేమో. ఇక అమలాపాల్ మాత్రమే కాకుండా.. ఈ వ్యవహారంలో చాలామంది స్టార్స్ ఉన్నారనే వాదనలు ఉన్నాయి.

 తాజాగా గవర్నర్ ఇచ్చిన విచారణ ఆదేశాలు కేవలం అమలాపాల్ పై మాత్రమే కాదని.. ఇలా తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చిన అందరికీ వర్తిస్తాయనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే మాత్రం.. చాలా మంది చిక్కుల్లో పడతారనే అంచనాలున్నాయి.
Tags:    

Similar News