భ‌జ‌రంగి భాయిజాన్ కాపీ గోల‌

Update: 2015-10-09 19:30 GMT
స‌ల్మాన్‌ ఖాన్ హీరోగా న‌టించిన భ‌జ‌రంగి భాయిజాన్ సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి వెంటే రిలీజై, బాక్సాఫీస్‌ రికార్డుల‌లో పోటీప‌డిన చిత్ర‌మిది. దేశంలోనే టాప్ 2 ఫిలింగా రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో టాలీవుడ్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ ర‌చ‌యిత‌గా దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యారు.

ఇండియా-పాక్ బార్డ‌ర్‌ లో  త‌ప్పిపోయిన ఓ పాకిస్థానీ మూగ బాలికను భాయిజాన్ తిరిగి త‌న ఇంటికి ఎలా చేర్చాడ‌న్న‌దే క‌థాంశం. భాయిజాన్ ఓ ఆంజ‌నేయ‌భ‌క్తుడు. అత‌డు బార్డ‌ర్‌ లో ఎలాంటి విన్యాసాలు చేశాడ‌న్న‌ది ఇంట్రెస్టింగ్‌.  ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 700 కోట్లు పైగా వ‌సూలు చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమా విష‌యంలో ఓ వివాదం ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల‌కు పెద్ద మ‌చ్చ తెచ్చేలా ఉంది.

భ‌జ‌రంగి భాయిజాన్ క‌థ నాదే అంటూ ఓ ఆసామి హైకోర్టులో కేసు వేశాడు. ముంబై ఫిలింఛాంబ‌ర్‌ లో ఈ క‌థ‌ని రిజిష్ట‌ర్ చేశాను. అయితే ఈ సినిమాని థియేట‌ర్‌ లో చూసి షాక‌య్యాను. నా క‌థ‌నే కొట్టేశారు అంటూ ఫిర్యాదు చేశాడు. ఈనెల 10 న బుల్లితెర‌పై ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించ‌కుండా అడ్డు త‌గిలాడు. ఈ సినిమా టీవీ ప్రీమియ‌ర్ షో వేయ‌కుండా ఆదేశాలు ఇవ్వమని అడగ్గా.. అబ్బే ప్రీమియర్‌ ఆపొద్దు కాని దాని నుండి వచ్చే డబ్బుల తాలూకు ప్రొసీడింగ్స్‌ మాత్రం హోల్డులో పెట్టమని కోర్టలు ఆర్డర్‌ పాస్‌ చేసింది. ఈనెల 20న  కోర్టు మరోసారి వాదోప‌వాదాలు విన‌డానికి ప్ర‌స్తుతానికి తీర్పును వాయిదా వేస్తున్నామ‌ని కోర్టు జ‌డ్డి చెప్పారు.

అయితే ఈ క‌థ‌ని కొట్టేశారు అని వాదించినా .. అస‌లు టాలీవుడ్ రైట‌ర్ బాలీవుడ్ క‌థ‌ని కొట్టేయ‌డ‌మేంటో?  సేమ్ సెన్సిబుల్ థాట్ ఒకేసారి ఇద్ద‌రికి రాకూడ‌ద‌న్న రూల్ ఏమైనా ఉందా. అయినా విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ప‌సివాడి ప్రాణం లైన్ కాపీ కొట్టేశాన‌ని చెప్పారు క‌దా.. అంటే అదే తెలుగు సినిమా నుండి ఈ అన్‌ నోన్‌ రైటర్‌ కూడా కొట్టేసి కథ రెడీ చేసుకున్నాడా ఏంటి?
Tags:    

Similar News