స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు నిన్న గురువారం ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల నుంచి బన్నీ ఫ్యాన్స్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.68లోని ఆయన నివాసానికి భారీగా తరలి వచ్చారు. అయితే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అనుమతులు తీసుకోకుండా అర్ధరాత్రి సమయంలో బాణసంచా కాల్చినందుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రశాంత్ తో పాటు సంతోష్ అనే అభిమానిపై జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 290, 336, 188 కింద కేసు నమోదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నం.68లోని ఆయన నివాసానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా గంటకు పైగా బాణసంచా కాల్చడంతో చుట్టుపక్కల వారికి తీవ్ర అసౌకర్యం కలిగింది. దీంతో పలువురు 100కు కాల్ చేసి బాణసంచా శబ్ధం వల్ల ఇబ్బందులకు గురయ్యామని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రశాంత్ మరియు మరో అభిమాని సంతోష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.