క్యాస్టింగ్ కౌచ్ పై పోరాటం అంటూ నటి శ్రీరెడ్డి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్ లో పాగా వేసిన శ్రీరెడ్డి మరోసారి తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో లైంగిక దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, దాని నివారణకు కమిటీ వేయాలని హైకోర్టులో పిటిషన్ వేసింది. తాజాగా, నేడు ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు....తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై అభిప్రాయం తెలపాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆ తరహా లైంగిక వేధింపుల అంశాలపై అంతర్గత విచారణ కోసం టాలీవుడ్ లో కమిటీలు లేవని అభిప్రాయపడింది. దీంతోపాటు, ఈ తరహా లైంగిక దోపిడీ వ్యవహారాలపై మహిళా కమిషన్ ఏం చర్యలు తీసుకుందని హైకోర్టు ప్రశ్నించింది. న్యాయ సేవధికార సంస్థ సేవలు వినియోగించుకోవాలని స్పష్టం చేసింది.
క్యాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త సంధ్యారాణితోపాటు మరో ఆరుగురు దాఖలుచేసిన పిల్ పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీ రాధాకృష్ణన్, జస్టిస్ వీ రామసుబ్రమణియన్‌ల ధర్మాసనం ....నేడు తెలంగాణ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. రాష్ట్ర సినిమాటోగ్రఫీ - మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శులు - చిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ - మహిళా కమిషన్ చైర్ పర్సన్ - తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ - కార్మిక శాఖ కమిషనర్ - డీజీపీలను ప్రతివాదులుగా వారు పేర్కొన్నారు. ఈ కేసు విచారణను వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది. గతంలోనూ ఈ క్యాస్టింగ్ కౌచ్ వివాదంపై సీబీఐ - తెలంగాణ - ఆంధ్ర డీజీపీలకు హైకోర్టు నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి తరపున గోపాల కృష్ణ కళానిధి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన కోర్టు.. వివరణ ఇవ్వాల్సిందిగా తెలుగు రాష్ట్రాల డీజీపీలతో పాటు సీబీఐలను ఆదేశించింది.