జీవితంలో ఇప్పటిదాకా ఒక్కసారి కూడా పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేయకపోయినా.. తెర మీద మాత్రం ఎమ్మెల్యే పాత్ర పోషించడం చాలా చిత్రంగా ఉందని అంటోంది కేథరిన్ థ్రెసా. అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న ‘సరైనోడు’ సినిమాలో తాను పోషించిన ఎమ్మెల్యే పాత్ర తన కెరీర్లో చాలా ప్రత్యేకమైందని ఆమె అంటోంది. ‘‘ఈ సినిమాలో యంగ్ ఎమ్మెల్యేగా నటించా. నా వయసులో ఉన్న హీరోయిన్లు ఎవ్వరూ ఇలాంటి పాత్ర చేయరు. బాధ్యతగల రాజకీయ నాయకురాలిగా నేను చేసిన పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. నిజానికి రాజకీయాల గురించి నాకేమీ తెలియదు. అసలు ఒక్కసారి కూడా ఓటు వేయలేదు. నాకసలు ఓటర్ ఐడీ కూడా లేదు. అలాంటి నాకు ఈ పాత్ర చేయడం ఓ సవాలే’’ అని కేథరిన్ చెప్పింది.
తాను తెలుగులో ఐదు సినిమాలు చేస్తే అందులో మూడు సినిమాలు బన్నీతోనే కావడం (ఇద్దరమ్మాయిలతో.. రుద్రమదేవి.. సరైనోడు) యాదృచ్ఛికమని.. అనుకోకుండా అలా కుదిరేసిందని కేథరిన్ చెప్పింది. ‘‘ఈ సినిమాలో బన్నీతో పోటాపోటీగా డ్యాన్సులేశా. రెండు పాటలకూ మంచి డ్యాన్సులు కుదిరాయి.బన్నీ డెడికేషన్ గురించి నాకు బాగా తెలుసు. 10 రోజులు ఏకధాటిగా పని చేసి 11వ రోజు కూడా పనుంది అంటే అదే ఎనర్జీతో వస్తాడు. అతడితో పని చేయడం మంచి అనుభవం. ఇక రకుల్, నా కాంబినేషన్లో వచ్చే సినిమాలు ఆసక్తికరంగా ఉంటాయి. షూటింగ్ సందర్భంగా ఆమెతో చాలా తక్కువ మాట్లాడా. ఆమె చాలా డెడికేషన్ ఉన్న హీరోయిన్’’ అని కేథరిన్ పేర్కొంది.