మలయాళీ ముద్దుగుమ్మ కేథరిన్ థ్రెసాకు టాలీవుడ్ లో ఇప్పటివరకూ సరైన బ్రేక్ రాలేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో జత కట్టిన రెండో సినిమాలో కూడా.. ఈమె సెకండ్ హీరోయిన్ పాత్రనే పోషిస్తోంది. అయితే.. సినిమాల్లో సంగతి ఎలా ఉన్నా.. ఆఫ్ స్క్రీన్ లో మాత్రం అమ్మడి బిహేవియర్.. ఓ యువరాణి రేంజ్ లో ఉంటుందని అంటున్నారు సరైనోడు యూనిట్.
అర డజన్ మంది పర్సనల్ స్టాఫ్ - కొంతమంది బాడీగార్డులు ఎప్పుడూ ఆమె చుట్టూ ఉంటారు. ఏదన్నా ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఛానల్ కు వెళ్లాలన్నా.. కేథరిన్ కంటే ముందే ఆమె స్టాఫ్ వెళ్లిపోయి అక్కడ అన్నీ చెక్ చేసుకుంటారు. మొత్తం ఓకే అని ఇన్ఫర్మేషన్ వచ్చాకే.. కారులోంచి కేథరిన్ కాలు బయట పెడుతుందిట. సింపుల్ గా అయితే మంత్రులకు ఎస్కార్ట్ రేంజ్ లో బిహేవ్ చేస్తారట.. ఈమె బౌన్సర్స్.
ఇదంతా సినిమాల కోసం వచ్చిన రాయల్టీ కాదులెండి. సహజంగానే బాగా ధనవంతుల వారసురాలు కేథరిన్. ఆమె పేరెంట్స్ ఫారిన్ లోనే ఉంటున్నారు. ఇక తను ఉండడం కోసం హైద్రాబాద్ బంజారా హిల్స్ లో ఓ పోష్ ఫ్లాట్ ని రెంట్ కి తీసుకుందట కేథరిన్ థ్రెసా. ఇక్కడ తను చేసే సినిమాలతో పోల్చితే, ఇది బాగా కాస్ట్లీ అని.. అయినా సరే అమ్మడి లైఫ్ స్టైల్ అలాగే ఉంటుందని అంటున్నారు.