కావేరీ జలాల వివాదం రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రగిలించింది. కర్నాటక-తమిళనాడు రాష్ట్రాల ప్రజలు పరస్పరం భౌతిక దాడులకు కూడా తెగబడుతున్నారు. తమిళనాడు రిజిస్ట్రేషన్ కనిపిస్తే చాలు.. కర్నాటకలో వాహనాలు ధ్వంసం అయిపోతున్నాయి. కన్నడిగుల వ్యాపారాలపై దాడులు చేస్తున్నారు తమిళులు. దీంతో.. పలువురు సినీ నటులపై కూడా దాడులు జరిగే ప్రమాదం ఉందని తమిళనాడు ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్టులు వచ్చినట్లు తెలుస్తోంది.
దీంతో సూపర్ స్టార్ రజినీకాంత్ సహా పలువురు సినీ నటులకు భద్రత పెంచింది జయలలిత సర్కారు. రజినీతో పాటు.. ప్రభుదేవా.. రమేష్ అరవింద్.. బాబీ సింహాలకు అదనపు రక్షణ కల్పించాల్సి వచ్చింది. వీరంతా కర్నాటకతో రిలేషన్ ఉన్నా తమిళనాడులో సెటిల్ అయిపోయిన వారే కావడం గమనించాలి. ఈ కారణంతోనే దాడులకు ఆస్కారం ఉందని అంచనాలున్నాయి. ఇదంతా ముందు జాగ్రత్త చర్యలతోనే అని చెబుతున్నా.. ఐబీ రిపోర్టుల కారణంగానే అంటున్నారు.
మహరాష్ట్రలో పుట్టిన రజినీ.. కర్నాటకలో కొన్నేళ్ల పాటు ఉన్నారు. ప్రభుదేవా అక్కడే పుట్టాడు. రమేష్ అరవింద్- బాబీ సింహాలు కూడా కన్నడ సినిమాలతో గుర్తింపు పొందిన వారే. వీరందరి పైనా దాడులకు అవకాశం ఉండడంతో భద్రత పెంచాల్సి వచ్చింది.