బాలీవుడ్ లో ప్రముఖ సెలబ్రిటీలకు ఫ్యాషన్ డిజైనర్ గా వ్యవహరించటమే కాదు.. దేశంలోనే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరు వెండల్ రోడ్రిక్స్. పద్మశ్రీ గ్రహీత అయిన ఆయన వయసు 59 ఏళ్లు. ముంబయిలో పుట్టిన ఆయన సెలబ్రిటీల ఫ్యాషన్ డిజైనర్ గా సుపరిచితుడు.
అలాంటి ఆయన గోవాలోని కాల్వాలే గ్రామంలోని తన సొంతింట్లో బుధవారం రాత్రి మరణించారు. ఆయన మరణానికి కారణం ఏమిటో బయటకు రాలేదు. రాత్రి వేళ తన ఇంట్లో ఉన్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలారని.. కారణం ఏమిటో తెలియరావటం లేదని చెబుతున్నారు. తొలి లాక్మే ఇండియా ఫ్యాషన్ వీక్ ప్లానింగ్ లో చురుకుగా పాల్గొన్న ఆయన.. పలు ఫ్యాషన్ వీక్స్ లో తన కలెక్షన్లను ప్రదర్శించారు.
ఆయన మరణం సెలబ్రిటీలకు షాకింగ్ గా మారింది. ఆయన మరణవార్తపై గోవా ఆరోగ్య శాఖామంత్రి విశ్వజిత్ రాణే ట్వీట్ చేశారు. రోడ్రిక్స్ మరణం తనను కలిచివేసిందన్నారు. ఆయన లేని లోటు ఫ్యాషన్ ప్రపంచంలో పూడ్చలేనిదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన మరణించారన్న సమాచారం సెలబ్రిటీ వర్గాల్లో షాకింగ్ గా మారింది.