వరదలు - ఉప్పెనల వేళ టాలీవుడ్ స్పందిస్తున్న తీరు .. మానవతా సాయానికి ఇరుగుపొరుగు రాష్ట్రాల ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అప్పట్లో సునామీ ఉత్తరాంధ్రను - వైజాగ్ ని ఒణికించినప్పుడు, అటుపై చెన్నయ్ ని వరదలు ముంచెత్తినప్పుడు - మొన్నటికి మొన్న కేరళను వరదలు అతలాకుతలం చేసినప్పుడు, ప్రస్తుతం తిత్లీ తుఫాన్ శ్రీకాకుళం జిల్లాని నాశనం చేసినప్పుడు.. ఇలా ప్రతి సందర్బంలో మన స్టార్లు విరివిగా విరాళాలు అందిస్తూ గొప్ప సాయం ప్రకటిస్తున్నారు. మూవీ ఆర్టిస్టుల సంఘం తనవంతు సాయానికి ముందుకొస్తూ మంచిని చాటుతోంది. ఇండివిడ్యువల్ గా స్టార్లు - నటీనటులు సాయం ప్రకటిస్తూ ధాతృత్వం చాటుకుంటున్నారు.
ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకు తిత్లీ తుఫాన్ వల్ల కేవలం కొన్ని గంటల్లోనే తీరని నష్టం వాటిల్లింది. 2400 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. పేదప్రజలంతా కూడు- గూడు లేక రోడ్డున పడాల్సొచ్చింది. ఆ దృశ్యాలు టీవీల్లో చూసి సెలబ్రిటీలు వెంటనే స్పందిస్తున్నారు. ఇప్పటికే పలువురు తారలు సీఎం రిలీఫ్ ఫండ్ కి భారీ మొత్తాల్ని విరాళంగా ప్రకటిస్తున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ 25లక్షలు - ఎన్టీఆర్ 15లక్షలు - కళ్యాణ్ రామ్ 5లక్షలు ప్రకటించారు. ఆ తర్వాత బాలకృష్ణ కుమార్తె మరో 60లక్షలు ప్రకటించారు.
మెగా హీరోల్లో అల్లు అర్జున్ 25లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కి ప్రకటించారు. అలాగే వరుణ్ తేజ్ - నిఖిల్ - సంపూర్ణేష్ - విజయ్ దేవరకొండ వంటి స్టార్లు స్పందించి తమవంతుగా సాయాన్ని అందించారు. మూవీ ఆర్టిస్టుల సంఘం తమవంతు సాయంగా రూ.5లక్షలు ప్రకటించి ధాతృత్వం చాటుకుంది. మా అధ్యక్షులు శివాజీరాజా - ప్రధాన కార్యదర్శి నరేష్ ఈ విషయాన్ని జాయింట్ గా ప్రకటించడం విశేషం.