తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అతి పెద్ద నీటి పారుదల (ఇర్రిగేషన్) ప్రాజెక్టుల్లో ది బెస్ట్ ప్రాజెక్ట్ ఇది. గోదావరి నదిపై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. 2016లో పునాది రాయి వేసి కేవలం రెండు మూడేళ్లలోనే పూర్తి చేసి ఇంతలోనే ప్రారంభించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి- గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ సమక్షంలో ఈ ప్రాజెక్టు అత్యంత వైభవంగా మొదలైంది.
ఈ ప్రాజెక్టుపై టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. కేసీఆర్ .. కేటీఆర్ సహా తెలంగాణ సీఎంవోకి సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సూపర్ స్టార్ మహేష్ ప్రత్యేకించి తెలంగాణ సీఎంవో.. కేటీఆర్ లకు శుభాకాంక్షలు తెలిపారు. ``విప్లవాత్మకమైన మార్పు ఇది... అనుకున్న కలను నెరవేర్చారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఇర్రిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించినందుకు హ్యాట్సాఫ్ టు ఇంజినీర్స్`` అంటూ సామాజిక మాధ్యమాల్లో మహేష్ అభినందించారు.
కింగ్ నాగార్జున ఈ ప్రాజెక్టుపై మాట్లాడుతూ.. మనిషి మేధోతనానికి ఇది చిహ్నం .. అతి పెద్ద సర్ ప్రైజ్.. ఏ మార్వల్ ఆఫ్ హ్యూమన్ ఇంజినీరింగ్! అంటూ ప్రశంసలు కురిపించారు. ఇంత పెద్ద లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలోనే లేదని కీర్తించారు నాగ్. మాస్ మహారాజా రవితేజ.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సైతం ప్రశంసలు కురిపించారు. తొలుత సీఎం కేసీఆర్ ని కలిసి అభినందించిన ప్రకాష్ రాజ్.. అటుపై మాట్లాడుతూ.. ``ప్రకాష్ ఇది నా డ్రీమ్`` అని సీఎం కేసీఆర్ నాతో అన్నారు. ``ఈ కలను నెరవేర్చుకునేందుకు అతడు చేసిన కృషిని నేను చాలా కాలంగా ఆసక్తిగా గమనిస్తున్నా. ఈరోజు ఆ కల నిజమైంది. తెలంగాణకు శుభాకాంక్షలు. థాంక్యూ కేసీఆర్ గారూ.. లక్ష్యంతో దూసుకెళుతున్నందుకు...`` అని అన్నారు. కాళేశ్వరం ఇంజినీరింగ్ అద్భుతం అనడంలో ఎలాంటి సందేహం లేదని మాస్ మహారాజా రవితేజ ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ - కేటీఆర్ .. తెలంగాణ సీఎంవోకి ఈ క్రెడిట్ దక్కుతుందని అన్నారు. గ్రేట్ మైండ్స్ రియల్ గా చేసి చూపించాయని ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.