రాణీ వారి పెళ్లికి ఎన్నిసార్లయినా విందు ఇస్తారు. రోజుకోసారి పసందైన విందు వేడుకలకు కొదవేం ఉండదు. ఓసారి దిల్లీలో - ఇంకోసారి ముంబైలో - మరోసారి ఇంకెక్కడైనా విందే విందు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా పెళ్లి సెలబ్రేషన్ అలానే ఉంది. నిక్ జోనాస్ ని పెళ్లాడి నిక్యాంకగా పిలుపు అందుకుంటున్న ఈ అమ్మడు తాజాగా ముంబైలో రెండు రోజులుగా విందు కార్యక్రమాలతో హోరెత్తిస్తోంది. డిసెంబర్ 1న పెళ్లి వేడుక అనంతరం ముందుగా ప్రధాని నరేంద్రమోదీ సహా రాజకీయ వర్గాలకు ఓసారి దిల్లీలో విందు ఏర్పాటు చేసిన నిక్యాంక జోడీ - అటుపై ముంబైలో భారీ రిసెప్షన్ కి ప్లాన్ చేశారు.
ముంబై రిసెప్షన్ మొదటిరోజు(బుధవారం) సినిమా జర్నలిస్టులు - కుటుంబ సభ్యులకు ప్రత్యేకించి విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం బాలీవుడ్ టాప్ సెలబ్రిటీలందరి కోసం ప్రత్యేకించి రిసెప్షన్ వేడుకను ఘనంగా నిర్వహించింది నిక్యాంక జోడీ. ఈ వేడుకకు దీప్ వీర్ (దీపిక - రణవీర్ సింగ్) జంట ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు.
వీళ్లతో పాటు సల్మాన్ ఖాన్ కత్రిన సమేతుడై విచ్చేయగా - ఏ.ఆర్.రెహమాన్ కుటుంబ సమేతంగా ఎటెండ్ అయ్యారు. ఇక హబ్బీతో కలిసి బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ముఖేష్ భట్ - నటుడు భరత్ తదితరులు ఈ వేడుకలకు ఎటెండ్ అయ్యారు. అలాగే ఈ రిసెప్షన్ కి హాజరైన సెలబ్రిటీలంతా స్పెషల్ డిజైనర్ లుక్ తో వెన్యూని అదరగొట్టేయడం విశేషం. అతిధులందరితో నిక్ ఎంతో కలివిడిగా కలిసిపోయి కనిపించడం హైలైట్.