ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు రొమాన్స్ సర్వసాధారణం. పలువురు బాలీవుడ్ తారలు టీవీ స్టార్ల ప్రేమ వ్యవహారాలు విజయవంతమై పెళ్లిబంధంతో వికసించడం చూస్తున్నాం. కానీ కొన్నిసార్లు అనుకున్నవి ఏవీ అనుకున్నట్లుగా జరగవు. దానినే విధిరాత అని అంటారు! సల్మాన్ ఖాన్ నుండి అక్షయ్ కుమార్ వరకు.. త్రిష నుంచి కరిష్మా తన్నా వరకూ.. నిశ్చితార్థం చేసుకుని బ్రేకప్ అయిన ప్రముఖుల జాబితా ఇలా ఉంది. వారి బంధానికి అనూహ్యంగా బ్రేక్ పడడానికి రకరకాల కారణాలున్నాయి.
బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ సంగీతా బిజ్లానీతో చాలా కాలం ప్రేమాయణం సాగించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ ఇద్దరూ తమ నిశ్చితార్థాన్ని విరమించుకున్నారు, అయితే ఇప్పటికీ స్నేహపూర్వకంగా ఉన్నారు. ఆ బ్రేకప్ వెనక కారణాలేవీ తెలీదు కానీ సల్మాన్ మళ్లీ పెళ్లి ఊసెత్తలేదు! ఐశ్వర్యారాయ్- కత్రిన కైఫ్- సోమీ అలీ- లులియా వాంటూర్- జాక్విలిన్ సహా పలువురితో అతడు ప్రేమాయణాలు సాగించాడు. ఐశ్వర్యారాయ్ తో సల్మాన్ వివాహానికి ఛాన్సుందని భావించినా గొడవలతో విడిపోయారు. ఆ తర్వాత ఐష్ స్మాల్ బిని పెళ్లాడిన సంగతి తెలిసిందే.
ఖిలాడీ అక్షయ్ కుమార్ బాలీవుడ్ హాట్ హీరోయిన్ రవీనా టాండన్ ని పెళ్లాడేందుకు సిద్ధమయ్యాడు. బంధుమిత్రుల సమక్షంలో వేడుకగా నిశ్చితార్థం జరిగింది. అతడితో సెటిల్ అవ్వాలని భావించిన రవీనా ఏకంగా అతని కోసం బాలీవుడ్ నుండి తప్పుకోవడానికి సిద్ధమైంది. అయితే వీరిద్దరూ గొడవలతో విడిపోయి ఎంగేజ్మెంట్ ను బ్రేక్ చేసుకున్నారు. తర్వాత అక్షయ్ మరో కథానాయిక ట్వింకిల్ ఖన్నాను పెళ్లాడాడు.
అభిషేక్ బచ్చన్ అందాల కథానాయిక కరిష్మా కపూర్ తో ఆరేళ్లపాటు డేటింగ్ చేసాడు. ఈ జంట సంతోషంగా నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ అభిషేక్ తండ్రి అమితాబ్ బచ్చన్ ఆ ఇద్దరి సంబంధంతో సంతోషంగా లేరని దాంతో పెళ్లిని విరమించుకున్నారని కథనాలొచ్చాయి. అయితే కరిష్మా ఎప్పుడూ అభిషేక్ బచ్చన్ తో ఘర్షణ పడుతూ కనిపించేదని ఓ ప్రముఖ నిర్మాత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కానే కాదని అన్నారు.
బిగ్ బాస్ 16 కంటెస్టెంట్ సాజిద్ ఖాన్ నటి కం మోడల్ గౌహర్ ఖాన్ ను పిచ్చిగా ప్రేమించాడు. వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ప్రచారమైంది. సాజిద్ - గౌహర్ ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ ఆ తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖుడిగా సాజిద్ పేరు మార్మోగుతోంది.
బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ డిజైనర్ ప్రియాంక భాటియాతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇద్దరూ తమ ప్రేమాయణంపై బహిరంగంగా అంగీకరించారు. పెళ్లికి రెడీ అయ్యారు. అయితే ఆ తర్వాత ఇద్దరూ తమ బంధాన్ని తెంచుకున్నారు.
సల్మాన్ ఖాన్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8లో కరిష్మా తన్నాను నటుడు ఉపేన్ పటేల్ కలిశారు. వారు మరొక రియాలిటీ షోలో నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి గ్రాండ్ ప్లాన్స్ చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఏదీ వారికి అనుకూలంగా లేకపోవడంతో విడిపోయారు.
సౌత్ కథానాయిక త్రిష బిజినెస్ మేన్ కం తమిళ నిర్మాత వరుణ్ మణియన్ ని పెళ్లాడేందుకు సిద్ధమైంది. నిశ్చితార్థం కూడా పూర్తయింది. కానీ ఆ తర్వాత రకరకాల కారణాలతో బ్రేకప్ అయ్యింది. పెళ్లి క్యాన్సిల్ అయ్యాక త్రిష మళ్లీ పెళ్లి మాటెత్తలేదు. కెరీర్ పరంగా ఇప్పటికీ బిజీగా ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.