సినిమాలో అది పెట్టవద్దు ఇది పెట్టవద్దు అని చెబుతూ కొన్ని అనవసర సూచనలు ఇస్తుంది సెన్సార్ బోర్డ్. ఏది ఎందుకు వద్దు అంటుందో ఎందుకు తీసేయమని చెబుతుందో తెలియదు అని సెన్సర్ బోర్డుపై మన ఫిల్మ్ మేకర్స్ చాలాసార్లు వాళ్ళ ఆక్రోశాన్ని బయటపెడుతూనే ఉంటారు. సినిమాలో పొగ తాగడం ఎప్పుడో నిషేదించారు దాని సినిమా వర్గం నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కొన్ని మాటలు తెర పై మాట్లాడ రాదని కూడా చెప్పింది. కొన్ని విషయాలలో సెన్సార్ నిర్ణయాలు వాళ్ళ ఆలోచనలు మనం ఏకీభవించక పోయినా ఇప్పుడు తీసుకున్న ఒక నిర్ణయం విషయంలో మాత్రం అందరూ సమ్మతి పలకక తప్పదు. అది ఏంటంటే..
మనం సినిమా చూస్తున్నప్పుడు చాలాసార్లు హీరోనో లేక సినిమాలో మరి ఎవరో ఒక ఫోన్ నంబర్ చెబుతారు. ఇప్పుడు అలా ఒక ఫోన్ నంబర్ వాడినట్లు అయితే ఆ ఫోన్ నంబర్ సంబందించిన వివరాలు తెలియపరచాలి అని ఒక నిబంధన పెట్టింది సెన్సార్. కొన్ని సార్లు ఇలా ఏదో ఒక నంబర్ వాడేసి ఆ తరువాత ఈ నంబర్ వాడే వాళ్ళకి కొన్ని అవాంఛనీయ కాల్స్ - మెసేజ్లు వస్తున్నాయి అని చాలా సార్లు కేసులు నమోదు జరిగాయి. అందుకని ముందు ముందు అలా జరగకుండా ఉండాలి అంటే ఇటువంటి నిబంధనలు తప్పనిసరి అని తెలిపింది సెన్సార్ బోర్డు. సినిమా స్క్రీన్ పై వినిపించే ఆ నంబర్ వాడే వాళ్ళ దగ్గర అనుమతి తీసుకునే నైనా ఉండాలి లేకపోతే సినిమా నిర్మిస్తున్న వాళ్ళకి వాళ్ళు తెలిసినవారైనా కావాలి అనే నిబంధన పెట్టింది.
ఏ విషయంలో నైనా మనం సెన్సార్ బోర్డు వాళ్ళ పై చిరాకు పడవచ్చు కానీ ఈ నిర్ణయం పై మాత్రం అందరూ వాళ్ళ అంగీకారాన్ని సంకోచంలేకుండా చెబుతున్నారు. అవును ఇది ఒక విదంగా మంచిదే కదా. మొత్తానికి సెన్సార్ పెట్టిన ఇన్ని ఏళ్ళకు ఎటువంటి వ్యతిరేకం లేకుండా ఒక నిబంధన ఓకే చేసారు అందరూ.