అలా కత్తిరింపులు చేస్తే ఎలా సెన్సర్?

Update: 2017-08-02 08:21 GMT
సినిమా సినిమాకూ సర్టిఫికేషన్ బోర్డుతో గొడవలు ఈనాటివి కాదు అవి ఎప్పటికీ అంతం కూడా కావు. సినిమాలు ఆరోగ్యకర వినోదాన్ని అందించాలి అని వాళ్ళు మనిషి మనోభావాలును చెప్పలేని సినిమా ఎందుకు అని వీళ్ళు ఎప్పుడు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. కిందటి ఏడాది వచ్చిన ‘ఉడ్తా పంజాబ్’ సినిమా పై సెన్సర్ బోర్డు వైకరికి మొత్తం బాలీవుడ్ అంతా ఒకటై వ్యతిరేకంగా నిలిచి ఈ సినిమా విడుదలకు సహకరించారు. అలాగే ఈ మధ్య విడుదలైన సినిమా ఆడవాళ్ళ సెక్స్ సమస్యలు పైన సమాజం ఆడవాల్లని ఏ విదంగా చూస్తుంది అనే కథతో వచ్చిన ‘లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా’  సినిమా కూడా విడుదల కావడానికి చాల ఇబ్బందులు ఎదురుక్కుంది CBFC వలన.

ఇప్పుడు సెన్సర్ కత్తిరింపులు వలన మరో సినిమా ఇబ్బంది పడింది. నవాజుద్దీన్ సిద్దిఖి హీరోగా నటిస్తున్న సినిమా బాబూమోషాయ్ బందూక్ బాజ్ సెన్సర్ బోర్డు వాళ్ళకి పంపితే సెన్సర్ వాళ్ళు ఏకంగా 48 కట్స్ చేశారట. ఇలా ఇన్ని కట్స్ చెప్పేసరికి ఆ సినిమాను నిర్మిచేవాళ్లు ఇంకా మేము సినిమాను ఎందుకు విడుదల చేయడం అన్నీ సీన్లు సినిమా నుండి తీసిస్తే కథేం అవుతుంది, మేము చెప్పాలి అనుకునేది ఏం చెబుతాము అని వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. దానితో వీరు ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పేల్లట్ ట్రిబునల్(FCAT) వాళ్ళ సహాయం కోరింది. ఈ సినిమా విడుదల తేది కూడా ఫిక్స్ చేసుకున్నారు సదరు నిర్మాణ సంస్థ. ‘లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా’ సినిమా విడుదలకు సిద్దమై కొన్ని నెలలు పాటు సెన్సర్ బోర్డు వాళ్ళతో పొరాడి చివరకు మన దేశం లో విడుదలకు నోచుకుంది. ఇప్పుడు నవాజుద్దీన్ సినిమా అదే సమస్యను ఎదురుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పుడు నుంచే కొన్ని వివాదాలుకు దారితీసిందిలే.

ముందు ఇప్పుడు బిడిత బాగ్ చేసిన పాత్రలో చిత్రాంగద సింగ్ చేయవలిసి ఉంది కానీ కొన్ని శృతి మించిన సెక్స్ సీన్లు ఉండటం చేత ఆమె చేయడానికి నిరాకరించింది. అదే కాకుండా సంజయ్ చౌహాన్ అనే కాస్టింగ్ మేనేజర్ నవాజుద్దీన్ పై కామెంట్ కూడా చేయడంతో అప్పటిలో పెద్ద వివాదానికి దారితీసింది. నవాజుద్దీన్ తో నటించడానికి ఒక అందమైన అమ్మాయి కావాలి అంటే వెతకడం కొంచం కష్టమే అని కామెంట్ చేశాడు. ఇలా వివాదాలతో మొదలై విడుదలకు సిద్దమైన ఈ సినిమా ఇంకా ఎన్ని వివాదాలుకు తెర లేపుతుందో చూడాలి. ఆగష్టు 25 న విడుదల చేయడానికి సిద్దం చేస్తున్నారు.​
Tags:    

Similar News