అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం 'ఆడై' గురించి తాజాగా విడుదలైన టీజర్ తర్వాత తెగ మాట్లాడుకుంటున్నారు. తమిళం మరియు తెలుగులో ఈ చిత్రం ఒకే సారి విడుదల కాబోతుంది. రెండు భాషల్లో ఒకేసారి టీజర్ ను విడుదల చేశారు. టీజర్ లో అమలా పాల్ ను పూర్తి న్యూడ్ గా చూపించడం జరిగింది. అమలాపాల్ న్యూడ్ షాట్స్ పై ప్రముఖులు పలువురు స్పందించారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ అమలాపాల్ న్యూడ్ షాట్స్ తన మనసుకు తాకాయంటూ కామెంట్ చేశాడు. టీజర్ లో ఇంత రచ్చగా ఉంటే ఇక సినిమాలో మరెంత రచ్చ రచ్చగా ఉంటుందో అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
సెన్సార్ వారు ఈ చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చి సెన్సార్ ఇచ్చే అవకాశం ఉందని అంతా భావించారు. కాని అన్యూహంగా ఈ చిత్రంలోని ఆ సీన్ ను ఎట్టి పరిస్థితుల్లో ఉంచవద్దని సెన్సార్ బోర్డు వాదిస్తుందట. ఇలాంటి సీన్ ఉంటే ఎ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేమని తేల్చి చెప్పిందట. ఆ షాట్స్ పూర్తిగా బ్లర్ చేయడం లేదంటే తొలగించడం చేస్తేనే సెన్సార్ చేస్తామంటూ పేచ్చి పెట్టడం జరిగిందట. దాంతో చిత్ర యూనిట్ సభ్యులు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సీన్ ను తొలగించడం లేదంటే బ్లర్ చేయడం చేయాల్సిందే.
వల్గర్ గా లేకుండా ఒక అమ్మాయి దీనావస్థను చూపించే విధంగా ఆ సీన్ ఉండబోతుంది. కాని సెన్సార్ బోర్డు మాత్రం అర్ధం చేసుకోకుండా ఆ షాట్స్ ను తొలగించాల్సిందేనంటూ పట్టుబడుతున్నారంటూ చిత్ర యూనిట్ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారట. సినిమా కు చాలా కీలకం అయిన ఆ షాట్స్ ను తొలగిస్తే సినిమాలో జీవమే లేకుండా పోతుందనే ఆందోళనలో యూనిట్ సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది. సెంట్రల్ సెన్సార్ బోర్డుకు వెళ్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అనే చర్చలు జరుగుతున్నాయని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.