సెన్సార్ షాక్ తో రివైజింగ్ కమిటీకి వెళ్ళారు!

Update: 2019-08-06 07:12 GMT
చందమామ కాజల్ చేతిలో ప్రస్తుతం చాలానే ప్రాజెక్టులు ఉన్నాయి.. వాటిలో ఒకటి 'ప్యారిస్ ప్యారిస్'.  బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం 'క్వీన్' కు తమిళ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది మొదట్లోనే పూర్తయింది.  త్వరలోనే రిలీజుకు సిద్ధం అవుతోంది.  అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సెన్సార్ చిక్కులు ఎదురవుతున్నాయట.

ఈ సినిమాలో కొంత బోల్డ్ కంటెంట్ ఉన్న విషయం తెలిసిందే.  'ప్యారిస్ ప్యారిస్' టీజర్ లో కాజల్ ను మరో బ్యూటీ 'నొక్కే' సీన్ సంచలనం సృష్టించింది.  ఆ సీన్ వల్ల ఒకవైపు విమర్శలు.. మరోవైపు లక్షల కొద్దీ వ్యూస్ వచ్చిపడ్డాయి. ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేషన్ విషయంలో సిబీఎఫ్సి ప్యానెల్ వారు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశారట.  బూతు మాటలను మ్యూట్ చేయాలని బోల్డ్ గా ఉన్న సీన్స్ లో దృశ్యాలను బ్లర్ చేయాలని సూచించడం జరిగిందట.  అయితే ఈ సూచనలను అంగీకరించని 'ప్యారిస్ ప్యారిస్' మేకర్స్ రివైజింగ్ కమిటీని ఆశ్రయించారట. మరి రివైజింగ్ కమిటీ 'ప్యారిస్ ప్యారిస్' సినిమాకు క్లియరెన్స్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.

హిందీ ఒరిజినల్ లో కంగనా రనౌత్ పోషించిన పాత్రలో రీమేక్ లో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. రమేష్ అరవింద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ చిత్రాని మీడియంట్  ఫిలిమ్స్ బ్యానర్ పై మణి కుమరన్ నిర్మిస్తున్నారు.

    

Tags:    

Similar News