కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు హీరో విశాల్. 'పందెంకోడి' 'పొగరు' 'పల్నాడు' 'వాడు వీడు' 'రాయుడు' 'పూజ' 'అభిమన్యుడు' 'డిటెక్టివ్' 'పందెంకోడి 2' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. విశాల్ నటించే ప్రతి సినిమాకి కూడా తెలుగులో యావరేజ్ గా చూసుకున్నా 5 కోట్ల షేర్ వస్తుంటుంది. ప్రస్తుతం విశాల్ 'డిటెక్టివ్ 2' 'చక్ర' వంటిరెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే 'చక్ర' సినిమా షూటింగ్ పూర్తయింది. అయితే ఈ సినిమా విడుదల విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.
ఎమ్.ఎస్ ఆనందన్ దర్శకత్వం వహించిన 'చక్ర' చిత్రాన్ని విశాల్ హోమ్ బ్యానర్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పై నిర్మించారు. సైబర్ హ్యాకర్ - బ్యాంక్ రాబరీ నేపథ్యంలో ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందింది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ - రెజీనా కసాండ్ర - శృతి డాంగే హీరోయిన్స్ గా నటించారు. ఫైనాన్సియల్ కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ కావడం లేదని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ అడ్డంకులు తొలిగితే ఫిబ్రవరి 26న 'చక్ర' సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో అంటున్నారు. మరి అప్పటికి అన్నీ క్లియర్ చేసి అనుకున్న సమయానికి సినిమాని రిలీజ్ చేస్తారేమో చూడాలి.