విశాల్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''చక్ర''. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ - రెజీనా కసాండ్ర - శృతి డాంగే హీరోయిన్స్ గా నటించారు. ఎమ్.ఎస్ ఆనందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విశాల్ హోమ్ బ్యానర్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పై నిర్మించారు. సైబర్ హ్యాకర్ - బ్యాంక్ రాబరీ నేపథ్యంలో పాన్ సౌత్ మూవీగా రూపొందిన 'చక్ర' ను ఫిబ్రవరి 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ మీద ఇంకా నీలి మబ్బులు వీడలేదని సినీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
విశాల్ గత సినిమాలకి సంబంధించిన కొన్ని ఫైనాన్సియల్ సెటిల్ మెంట్స్ ఇంకా చేయాల్సి ఉండటంతో ఈ సినిమా రిలీజ్ అవడం కష్టమే అని అంటున్నారు. అలానే 'అయోగ్య' సినిమాకి సంబంధించి 'క్రాక్' ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు కూడా కొంత సెటిల్ చేయాల్సి ఉందట. మొత్తం మీద అన్నీ కలుపుకొని విశాల్ దాదాపుగా 40 కోట్ల వరకు సెటిల్ చేయాల్సి ఉందని.. ఈ అడ్డంకులు తొలిగితే కానీ ఈ సినిమా రిలీజయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో 'చక్ర' సినిమా చెప్పిన తేదీకి వస్తుందా పోస్ట్ పోన్ అవుతుందా అనేది చూడాలి.